తొందరపాటు తగదు…!

ఇండ‌స్ట్రీలో రిలేష‌న్స్ చాల సెన్సిటివ్ గా ఉంటాయి. ఒక‌ర్ని ఒక‌రు పొగుడుకోవ‌డం ఎంత సాధ‌ర‌ణ‌మో.. అలాగే విమ‌ర్శించుకోవ‌డం అంతే సాధ‌ర‌ణం. అయితే క్రిటిసిజమ్‌ అనేవి తెర వెన‌క వుంటాయి. ఎవ‌రు ఓపెన్ గా చేయ‌రు. ఎవరో త‌మ్మ‌రెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి ఒక‌రిద్ద‌రు మాత్రం ముక్కు సూటిగా ఉన్న‌ది ఉన్న‌ట్లు ఎవ‌రి గురించి అయిన త‌మ మ‌న‌సులో మాట‌ను చెబుతారు. అలాగే ఇండ‌స్ట్రీ కూడా వారిని అలా అంగీక‌రించారు. కానీ.. మిగిలిన వారంద‌రికి ఇది వ‌ర్తించ‌దు. ఇంత‌కి అస‌లు విషయం ఏమిటంటే.. ఈ మ‌ధ్య ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ తో క‌ల‌సి చార్మి జ్యోతిల‌క్ష్మి అనే చిత్రంచేసింది. దీంతో దర్శ‌కుడు పూరితో వున్న సానిహిత్యంతో పూరి జ‌గ‌న్నాధ్ నితిన్ తో చేయ‌బోయో ఒక ప్రాజెక్ట్ విష‌యంలో తొంద‌ర ప‌డి కామెంట్ చేసింది. పూరి జ‌గ‌న్నాధ్.. హీరో నితిన్ తో చేయ‌బోయో సినిమా ఆగిపోయింద‌ని ఓపెన్ గా వ్యాఖ్యానించింది. ఈ విష‌యం హీరో నితిన్ వాళ్ల డాడీ సుధాకార్ రెడ్డి కి మంట పుట్టించింది. త‌నుకు ఎవ‌రు చెప్పారో..అటువంటి వార్త‌ను ఆధారం చేసుకుని.. త‌మ కొడుకు సినిమా ఆగిపోయిందని ఎందుకు కామెంట్ చేసింది. ప్రాజెక్ట్ ఆగ‌లేదు. దీంతో చార్మి పై ఏకంగా నిర్మాత‌ల మండ‌లికి ప‌రువున‌ష్టం కేసు వేయ‌డానికి సిద్ద ప‌డ్డార‌ట‌. అయితే ఈ లోపు చార్మి త‌న పొర‌పాటు ను మ‌న్నించాల‌ని ట్విట్ట‌ర్ లో క్ష‌మాప‌ణ‌లు తెలియ చేసింది. అవేమి ప‌ట్టించుకోలేద‌ట నిర్మాత సుధాక‌రెడ్డి. మ‌రి అస‌లు చార్మికి ఎందుకు ఈ తొందరపాటు అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఒక వేళ్ల చార్మి తో ద‌ర్శ‌కుడు పూరీ ఇలా చెప్పించాడా అనేది మ‌రో రూమ‌ర్. ! ఏమైన ఇది చార్మికి మైన‌సే క‌దా.!