Telugu Global
NEWS

కృష్ణా జ‌లాల్లో తెలుగు రాష్ట్రాల‌కు వాటాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య అత్యంత కీలకమైన కృష్ణా నది నీటి పంపకాలు పూర్తయ్యాయి. గ‌తంలో కేంద్రం నియ‌మించిన‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ 1 అవార్డును పరిగణనలోకి తీసుకుని ప్ర‌స్తుతం నీటి పంపిణీ జ‌రిగింది. ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటాకు 811 టీఎంసీల నీళ్లు వ‌చ్చేవి. ఇపుడు వీటిని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య పంపిణీ చేశారు. ఇందులో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీరు లభిస్తుందని కృష్ణా బోర్డు […]

కృష్ణా జ‌లాల్లో తెలుగు రాష్ట్రాల‌కు వాటాల పంపిణీ
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య అత్యంత కీలకమైన కృష్ణా నది నీటి పంపకాలు పూర్తయ్యాయి. గ‌తంలో కేంద్రం నియ‌మించిన‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ 1 అవార్డును పరిగణనలోకి తీసుకుని ప్ర‌స్తుతం నీటి పంపిణీ జ‌రిగింది. ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటాకు 811 టీఎంసీల నీళ్లు వ‌చ్చేవి. ఇపుడు వీటిని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య పంపిణీ చేశారు. ఇందులో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీరు లభిస్తుందని కృష్ణా బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులో 366 టీఎంసీలు ఉంటే.. అందులో ఏపీకి 167, తెలంగాణకు 199 టీఎంసీలు కేటాయించారు. నాగార్జున సాగర్‌కు 264 టీఎంసీలు కేటాయించగా.. వీటిలో ఏపీకి 164, తెలంగాణకు 100 టీఎంసీలు కేటాయించారు. ప్రకాశం బ్యారేజీకి కేటాయించిన మొత్తం 181.2 టీఎంసీలను ఏపీకి ఇవ్వాలన్న అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మిగులు జలాలను కూడా ఇదే నిష్ప‌త్తిలో పంచుకోవాలని నిర్ణయించారు.
First Published:  19 Jun 2015 12:06 AM GMT
Next Story