Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 118

సంతా: మిత్రమా! రాత్రి పూట సూర్యుడు ఎక్కడికి వెళతాడు? బంటా: ఎక్కడికీ వెళ్ళడు. అక్కడే ఉంటాడు. చీకటి వల్ల మనం చూడలేం. ————————————————————————– ఇద్దరు సర్దార్జీలు ఒక మల్టీస్టోర్‌ బిల్డింగ్‌లో ఉంటారు. ఒకరేమో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఒకరేమో ఎనిమిదవ ఫ్లోర్‌లో ఉంటారు. ఇద్దరికీ ఒకర్ని చూస్తే ఒకరికి పడదు. ఎనిమిదో ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీని అవమానించాలని ఒకసారి డిన్నర్‌కు పిలిచాడు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ ఎనిమిదో ఫ్లోర్‌కు వెళ్ళాడు. వెళ్తే అక్కడి […]

సంతా: మిత్రమా! రాత్రి పూట సూర్యుడు ఎక్కడికి వెళతాడు?
బంటా: ఎక్కడికీ వెళ్ళడు. అక్కడే ఉంటాడు. చీకటి వల్ల మనం చూడలేం.
————————————————————————–
ఇద్దరు సర్దార్జీలు ఒక మల్టీస్టోర్‌ బిల్డింగ్‌లో ఉంటారు. ఒకరేమో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఒకరేమో ఎనిమిదవ ఫ్లోర్‌లో ఉంటారు. ఇద్దరికీ ఒకర్ని చూస్తే ఒకరికి పడదు. ఎనిమిదో ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీని అవమానించాలని ఒకసారి డిన్నర్‌కు పిలిచాడు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న సర్దార్జీ ఎనిమిదో ఫ్లోర్‌కు వెళ్ళాడు. వెళ్తే అక్కడి సర్దార్జీ ప్లాటు లాక్‌ చేసివుంది. కానీ తలుపుకు ఒక బోర్డు ఉంది. దానిపై “నిన్ను ఫూల్‌ని చేశాను” అని రాసి ఉంది. అది చూసిన ఫస్ట్‌ఫ్లోర్‌ సర్దార్జీకి విపరీతంగా కోపం వచ్చి ఆ బోర్డు తప్పించి “నేనసలు ఇక్కడికి రానేలేదు” అని రాశాడు.

————————————————————————–
ఒక స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్కూలుకు వచ్చి పిల్లల్తో అన్నిటికన్నా కష్టమైన ఒక ప్రశ్న వేయమంటారా? లేదా సులభమైన రెండు ప్రశ్నలు వేయమంటారా? అని అడిగాడు. ఒక తెలివైన కుర్రాడు కష్టమయిన ఒక ప్రశ్న అడగమన్నాడు.
“ప్రపంచంలో పుట్టిన మొదటి స్త్రీ ఎవరు?” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
ఆ కుర్రాడు వెంటనే “జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో పుట్టిన ఆమె” అన్నాడు.
ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యంగా “ఆ సంగతి నీకెట్లా తెలుసు?” అన్నాడు.
తెలివైన కుర్రాడు “నో సెకండ్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌!” అన్నాడు.
————————————————————————–
ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. అక్కడంతా సెల్ఫ్‌ సర్వీసు. అందుకని ఒక ఆఫీసర్‌ ప్లేట్‌లో చికెన్‌ తందూరీ పెట్టుకుని ఆవురావురంటూ తింటున్నాడు. అదంతా చూసిన నెహ్రూగారు ఆ ఆఫీసరు భుజం తట్టి “మెల్లగా, నెమ్మదిగా తిను. ఆ కోడి చచ్చిపోయిందిగా! ఎక్కడికీ పారిపోదులే” అన్నాడు.

First Published:  18 Jun 2015 1:03 PM GMT
Next Story