Telugu Global
Cinema & Entertainment

టిప్పు రివ్యూ

ఇటు సినీ ప్రముఖులూ – అటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులూ ఎంతో అట్టహాసాన్ని అందివ్వగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి.వి. సీతారామరాజుగారు ౩౦౦ సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం వుండి నిర్మించిన చిత్రం “టిప్పు”. అదికూడా తన కొడుకు కార్తీక్ ని హీరోగా పరిచయం చేసిన చిత్రమిది. మీడియాలో ఎంతో ప్రచారం చేసిన టిప్పు చిత్రానికి ‘వారియర్ అఫ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. ఎంతో మంది వారియర్స్ ని దించినా బెదిరించినా ఈ సినిమాని […]

టిప్పు రివ్యూ
X

ఇటు సినీ ప్రముఖులూ – అటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులూ ఎంతో అట్టహాసాన్ని అందివ్వగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి.వి. సీతారామరాజుగారు ౩౦౦ సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం వుండి నిర్మించిన చిత్రం “టిప్పు”. అదికూడా తన కొడుకు కార్తీక్ ని హీరోగా పరిచయం చేసిన చిత్రమిది. మీడియాలో ఎంతో ప్రచారం చేసిన టిప్పు చిత్రానికి ‘వారియర్ అఫ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. ఎంతో మంది వారియర్స్ ని దించినా బెదిరించినా ఈ సినిమాని చూడడం చాలా కష్టం!

ఒక కొత్త హీరోని పరచయం చేనప్పుడు కొత్త కథని, కాన్సెప్ట్ ని ఎన్నుకోవాలేతప్ప పాత అరిగిపోయిన అవుట్ డేటెడ్ కథని తీసుకొని యిష్టా రాజ్యంగా సినిమాని తీసి ప్రేక్షకుల మీదకు వదలడం నేరం. అంతంకు మించి ఆర్థికంగా నష్టం. సినిమా ఫస్ట్ ఆఫ్ అరిగిందో గిరిగిందో ఎదో నడిచింది అనుకుంటే సెకండ్ ఆఫ్ గింగిరాలు తిప్పించి సినిమా హాల్లోంచి పారిపోయేలా చేస్తుంది.

కథ కొస్తే- మైసూర్ జిల్లా శ్రీరంగపట్నంలోఅరాచకత్వానికి అడ్రస్సుగా హరీబాయ్, కేశూబాయ్ ఇద్దరు అన్నదమ్ములు. గుడికొచ్చి కొబ్బరి చిప్పలు ఎత్తికెళ్ళినట్టు అమ్మాయిల్ని ఎత్తుకు పోతుంటారు. అలాంటి కేశూబాయ్ ని హీరో కృష్ణ(కార్తీక్) రక్షిస్తే హీరోయిన్ వైష్ణవి(కనిక కపూర్) నీళ్ళు పోసి ప్రాణాలు నిలుపుతుంది. నా ప్రాణాలు నిలిపావు కాబట్టి నువ్వే నా ప్రాణం అని భార్య ప్రాణాలు తీసి వైష్ణవిని పెళ్ళాడాలనుకుంటాడు. కార్తీక్ ఊరుకుంటాడా? ఏకంగా వుమన్స్ కాలేజీలో చేరి వారియరై కేశుబాయ్ ప్రాణాలు పోయేలా చేసి అన్న హరీబాయ్ ఆగ్రహానికి లోనయింది కాక విలనింట్లో మకాం వేస్తాడు. తమ్ముడు చనిపోయాడని చావుకు కారకులైన వారి కళ్ళముందు వున్న పదమూడు రోజులు చేతులు ముడుచుకు కూర్చుంటాడు. పద్నాల్గవ రోజు ఏమైంది అన్నది మిగతా కథ. ఈ కథ చాలదన్నట్టు కార్తీక్ పాత ప్రియురాలుని సజీవ దహనం చేసిన కథ ఒకటి. శుభం కార్డు పడేదాకా ఆగి వచ్చి హరీబాయ్ ని కాల్చిన పోలీస్ కమీషనర్(నాగబాబు). కథ కోసం కథగా వుంటుంది. ఎమ్మెస్ నారాయణ ట్రాక్ బాగుండే అవకాశం వుండి కూడా ప్రొపర్ ప్లేస్మెంట్ లేక జావగారిపోయింది. కృష్ణ భగవాన్ ట్రాక్ కూడా ఓవరైంది.

మణిశర్మ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ని బొరెత్తించి ఒకటి రెండు పాటలు పరవాలేదనిపిస్తాయి. కార్తీక్ కొన్ని చోట్ల పరవాలేదనిపించినా నేర్చుకోవాల్సేవుంది. నోరున్నందుకు మాట్లాడాలి అన్నట్టు డైలాగులే డైలాగులు.. పూరి కొన్ని చోట్ల ఆవహించాడు. కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అన్నీ తానైన జగదీష్ దానేటి మోడరేషన్ మార్క్స్ కలిపితే పాస్ అయ్యేలా మిగిలిపోయాడు!

రేటింగ్: 1.5/5

First Published:  19 Jun 2015 4:25 AM GMT
Next Story