Telugu Global
Cinema & Entertainment

తెగ సంబరపడిపోతున్న చెర్రీ హీరోయిన్...

ధనుష్ హీరోగా వేల్‌రాజ్‌ దర్శకత్వంలో వండర్‌బార్‌ ఫిలింస్‌ బ్యానర్ పై వస్తున్న చిత్రం “వీఐపీ2”. ఇందులో సమంత, ఎమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, సీనియర్‌ నటి రాధిక శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లండన్లో పుట్టిపెరిగిన ఎమీ జాక్సన్ సినిమా షూటుంగ్ మొదట్లో తమిళం అర్ధంగాక బాగా కష్టపడేదట. అయితే ఎమీ ‘వీఐపీ2’ కోసం చాలా కష్టపడి తమిళం నేర్చుకుందట. తన‌ తమిళ ప్రావిణ్యాన్ని సెట్‌లో ప్రదర్శించి, సమంత, రాధికలను ఆశ్చర్యంలో ముంచిందట. […]

తెగ సంబరపడిపోతున్న చెర్రీ హీరోయిన్...
X
ధనుష్ హీరోగా వేల్‌రాజ్‌ దర్శకత్వంలో వండర్‌బార్‌ ఫిలింస్‌ బ్యానర్ పై వస్తున్న చిత్రం “వీఐపీ2”. ఇందులో సమంత, ఎమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, సీనియర్‌ నటి రాధిక శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లండన్లో పుట్టిపెరిగిన ఎమీ జాక్సన్ సినిమా షూటుంగ్ మొదట్లో తమిళం అర్ధంగాక బాగా కష్టపడేదట. అయితే ఎమీ ‘వీఐపీ2’ కోసం చాలా కష్టపడి తమిళం నేర్చుకుందట. తన‌ తమిళ ప్రావిణ్యాన్ని సెట్‌లో ప్రదర్శించి, సమంత, రాధికలను ఆశ్చర్యంలో ముంచిందట. ‘ఒక విదేశీ తమిళంలో అందంగా మాట్లాడడం అద్భుతం. నీతో పనిచేయడాన్ని చాలా ఇష్టపడుతున్నాను బేబి’ అంటూ ఎమీని ఉద్దేశించి సమంత ట్విట్ చేయగా రాధిక కూడా తన స్పందనను ట్విట్టర్‌లో తెలియజేస్తూ.. ‘ఎమీజాక్సన్‌ తమిళం చాలా బాగుంది. సెట్స్‌లో సరదాగా ఉంది’ అని ఆమె వ్యక్త పరిచారు.
First Published:  20 Jun 2015 12:29 AM GMT
Next Story