టీ న్యూస్ చాన‌ల్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. త‌న బండారం బ‌య‌ట‌పెట్టిన టీ న్యూస్ చాన‌ల్‌పై ఏపీ సీఎం క‌క్ష గ‌ట్టార‌న్న‌ది బ‌హిరంగ స‌త్యం..! ఈ విష‌యాన్ని ప్ర‌తి విలేక‌రుల స‌మావేశంలో చెబుతున్నారు. ఇందులో భాగంగానే శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఏపీ సీఐడీ ఏసీపీ రమణ నేతృత్వంలో హైదరాబాద్‌కు వచ్చిన పోలీసులు కేబుల్ యాక్ట్ కింద టీ న్యూస్ సీఈవోకు ఈ నోటీసులు అందజేశారు. చంద్రబాబు పేరిట విడుదలైన ఆడియో రికార్డుల ప్రసారాల వల్ల రెండు ప్రాంతాల్లో విద్వేషాలు రేకెత్తే అవకాశం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది ఒక‌రంగా బెదిరింపులే అనుకోవ‌చ్చు. ప‌క్క రాష్ర్టంలో ఒక మీడియా సంస్థ‌కు నోటీసులు జారీ చేసేముందు స్థానిక పోలీసుల నుంచి అనుమ‌తి తీసుకోవాల‌న్న క‌నీస విజ్ఞ‌త మ‌రిచి ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు నిజంగా దుర‌దృష్ట‌క‌రం. చంద్ర‌బాబు బండారం బ‌య‌ట‌పెడితే కేసులు పెడ‌తారా? ప‌్ర‌తి విలేక‌రుల‌ స‌మావేశంలో టీన్యూస్‌, సాక్షిని ప్ర‌త్య‌ర్థుల చాన‌ళ్లు అని బాబు నిందిస్తున్నారు. కొన్నిరోజులుగా ఏపీలో ఎన్‌టీవీ ప్ర‌సారం కావ‌డం లేదు. జ‌రుగుతున్న చ‌ర్య‌ల‌న్నీ చూస్తుంటే..ఏపీలో మీడియా రెక్క‌లు విరిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబు అన్నింటికీ తెగించారు. అధికారుల‌ను, ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఎవ‌రినీ నిద్ర‌పోనివ్వ‌డం లేదు. ఎలాగైనా స‌రే త‌న‌కు అంటిన బుర‌ద‌ను వ‌దిలించుకోవాలి.. లేదంటే ఇదే బుర‌ద‌ను రెండు రాష్ట్రాల‌కు అంటించాలి అని శాయ‌శక్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు.

-అర్జున్