అసలైన ప్రచారం ఇప్పుడు మొదలైంది

బాహుబలి సినిమాకు సంబంధించి దశలవారీగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు రాజమౌళి. మొదట క్యారెక్టర్లు పరిచయం చేస్తూ మేకింగ్ వీడియోలు విడుదల చేశాడు. తర్వాత పోస్టర్లు విడుదల చేశాడు. తర్వాత పాటలు మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు బాహుబలికి సంబంధించి అసలైన ప్రచారాన్ని షురూచేశాడు జక్కన్న. దశలవారీగా బాహుబలి వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా మమతల తల్లి అనే పాటతో పాటు మరో థీమ్ సాంగ్ ను మిక్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆడియో సాంగ్స్ తో పెద్దగా ఆకట్టుకోలేక అంచనాలు తగ్గిన టైమ్ లో ఈ సాంగ్ బిట్ విడుదలై.. బాహుబలిని ఎక్స్ పెక్టేషన్స్ ని బ్యాలెన్స్ చేసింది. కేవలం ఇదొక్కటే కాదు… దాదాపు సినిమాలోని అన్ని పాటల్ని ఇలా వీడియోల రూపంలో విడుదల చేయాలని అనుకుంటున్నాడు రాజమౌళి. తర్వాత విడుదల తేదీ దగ్గరపడే టైమ్ లో ఫైట్ సీక్వెన్సులు కూడా రెండు విడుదల చేయాలని భావిస్తున్నాడు. గతంలో రాజమౌళి సినిమాలకు సంబంధించి ఇన్ని క్లిప్పింగులు ఎప్పుడు విడుదలకు ముందు రిలీజ్ కాలేదు. కానీ ఈసారి ఇన్ని రిలీజ్ కావడానికి కారణం బాలీవుడ్. అవును.. హిందీలో ఎంత పెద్ద సినిమా అయినా విడుదలకు ముందు సాంగ్ బిట్స్ అన్నీ విడుదల చేస్తారు. బాహుబలికి కూడా బాలీవుడ్ లో ప్రచారం కల్పించేందుకు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. కాబట్టి తెలుగులో కూడా అన్ని సాంగ్స్ విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.