బాహుబలికి సోమవారమే సెన్సార్

బాహుబలి సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా విడుదలకు వచ్చే నెల వరకు టైం ఉన్నప్పటికీ.. ఈలోగానే ఫస్ట్ కాపీని సిద్ధం చేసినట్టు సమాచారం. గ్రాఫిక్స్ వర్క్స్ తోపాటు రీ-రికార్డింగ్ మొత్తం పూర్తిచేసుకొని.. వచ్చే సోమవారం ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే సోమవారమే బాహుబలి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిపోతాయి. 
                  మరోవైపు ఈ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కరణ్ జోహార్, రాజమౌళి కలిసి భారీ స్కెచ్ రెడీ చేశారు. జులై 10న సినిమా రిలీజ్ కాబట్టి.. సరిగ్గా ఒకరోజు ముందు అంటే జులై 9న బాహుబలి సినిమాను బాలీవుడ్ ప్రముఖులకు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన షారూక్, సల్మాన్ లను ఈ సినిమా ప్రీమియర్ కు ఆహ్వానించాడు కరణ్ జోహార్. బాహుబలి ప్రీమియర్ లో రంజాన్ చేసుకుందాం రమ్మంటూ ఊరిస్తున్నాడు. వీళ్లతో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్, రణబీర్ కపూర్, అలియాభట్, హృతిక్ రోషన్ లాంటి ప్రముఖుల్ని కూడా ఆహ్వానించే పనిలో పడ్డాడు కరణ్ జోహార్. బాలీవుడ్ లో బాహుబలికి హైప్ వచ్చిందంటే సినిమాకు కలెక్షన్ల పంటే. ఎందుకుంటే అక్కడ 3 రోజులు గట్టిగా ఆడితే చాలు.. సౌత్ లో ఓ సినిమా నెల రోజులు ఆడినదానితో సమానం.