బాహుబలికి  దెబ్బ తప్పదు..

భారీ బడ్జెట్ తో రెండేళ్లుగా కష్టపడి తీస్తున్న బాహుబలి సినిమా విడుదలకు దాదాపు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. సోమవారం సెన్సార్ కూడా పూర్తిచేసే పనిలో ఉంది యూనిట్. ఇక విడుదల విషయానికొస్తే బాహుబలికి ఎలాంటి పోటీలేకుండా సౌత్ మార్కెట్ ను సర్దుబాటు చేశారు నిర్మాతలు. కానీ బాలీవుడ్ మార్కెట్ ను సర్దుబాటు చేయడం మాత్రం వీళ్ల తరం కాలేదు. బాలీవుడ్ లో బాహుబలికి సిసలైన పోటీ ఎదురైంది. ఆ పోటీని ఎదుర్కోవడం మామూలు విషయం కూడా కాదు. 
                   జులై 10న బాహుబలి సినిమా విడుదలవుతోంది. సినిమా విడుదలై సరిగ్గా వారం రోజులకు అంటే జులై 17కు సల్మాన్ సినిమా రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజైతే బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. థియేటర్లన్నీ కండలవీరుడు సినిమాకు కేటాయించాల్సిందే. 3 రోజుల్లో వందకోట్లు కొల్లగొట్టాల్సిందే. ఇదే ఇప్పుడు బాహుబలి టీం కు చెమటలు పట్టిస్తోంది. సల్మాన్ సినిమా విడుదలను ఎలాగూ అడ్డుకోలేరు కాబట్టి.. ఉన్న వారం రోజుల్లో బాహుబలికి మ్యాగ్జిమమ్ వసూళ్లు రాబట్టాలనే ప్లాన్ లో ఉంది టీం.