Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్ ఫోటోషూట్

చిరంజీవిని ఈమధ్య కాలంలో మీరు చూశారా.. మీకే కాదు.. ఎవరికీ మెగాస్టార్ కనిపించడు. ఎందుకుంటే అంతలా మారిపోయారు చిరంజీవి. తన 150వ సినిమా కోసం దాదాపు నెల రోజుల కిందటే కసరత్తులు ప్రారంభించిన మెగాహీరో ఇప్పుడు షాకింగ్ గెటప్ లోకి మారాడని సమాచారం. దాదాపు 15ఏళ్ల కిందట చిరు ఎలా ఉండేవారో అలా తయారయ్యారని టాక్. అదిరిపోయే ఫిజిక్ తో న్యూలుక్ తో బయటకొస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే కారణంతో కెమెరా కంటికి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు చిరు. […]

మెగాస్టార్ ఫోటోషూట్
X
చిరంజీవిని ఈమధ్య కాలంలో మీరు చూశారా.. మీకే కాదు.. ఎవరికీ మెగాస్టార్ కనిపించడు. ఎందుకుంటే అంతలా మారిపోయారు చిరంజీవి. తన 150వ సినిమా కోసం దాదాపు నెల రోజుల కిందటే కసరత్తులు ప్రారంభించిన మెగాహీరో ఇప్పుడు షాకింగ్ గెటప్ లోకి మారాడని సమాచారం. దాదాపు 15ఏళ్ల కిందట చిరు ఎలా ఉండేవారో అలా తయారయ్యారని టాక్. అదిరిపోయే ఫిజిక్ తో న్యూలుక్ తో బయటకొస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే కారణంతో కెమెరా కంటికి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు చిరు. నయా లుక్ తో ఓ ఫోటో షూట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా లాంఛింగ్ రోజున ఆ ఫొటోలతోనే టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తమ్మీద ఇప్పటి తరం యంగ్ స్టర్స్ కు పోటీనిచ్చేందుకు మరోసారి మెగాస్టార్ ముస్తాబవుతున్నారనడంతో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి 150వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. పూరీ జగన్నాధ్ ను కొనసాగిస్తారా.. లేక వీవీ వినాయక్ ను తీసుకుంటారా.. లాంటి ప్రశ్నలను పక్కనపెట్టి ప్రస్తుతం పూర్తిగా తన ఫిజిక్ పైనే దృష్టిపెట్టారు చిరు. జిమ్ లో కసరత్తులతో పాటు స్టూడియోలో డాన్సులు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.
First Published:  20 Jun 2015 1:12 AM GMT
Next Story