Telugu Global
Others

మొద‌టిసారి  మందుబాబుల  పండుగ

చికెన్ మేళా  … ఫిష్ ఫెస్టివ‌ల్ అంటూ .. న‌గ‌రంలో ర‌క‌ర‌కాల ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతుంటాయి. అయితే, ఈసారి మాత్రం స‌రికొత్త ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించారు సుచిర్స్ క్ల‌బ్ నిర్వాహ‌కులు. అదే మందుబాబుల పండుగ బీర్ ఉత్స‌వ్. విదేశాల్లో స‌ర్వ‌సాధారణంగా జ‌రిగే మందు పండుగ‌ను హైద‌రాబాద్ న‌గ‌రానికి  సుచిర్స్ క్ల‌బ్ నిర్వాహ‌కులు మొద‌టిసారిగా ప‌రిచ‌యం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మందుబాబుల కోసం  మొట్ట‌మొద‌టిసారిగా శుక్ర‌వారం రాత్రి   బీర్  ఉత్స‌వ్  జ‌రిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌రు 2 లోని సుచిర్స్ […]

మొద‌టిసారి  మందుబాబుల  పండుగ
X

చికెన్ మేళా … ఫిష్ ఫెస్టివ‌ల్ అంటూ .. న‌గ‌రంలో ర‌క‌ర‌కాల ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతుంటాయి. అయితే, ఈసారి మాత్రం స‌రికొత్త ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించారు సుచిర్స్ క్ల‌బ్ నిర్వాహ‌కులు. అదే మందుబాబుల పండుగ బీర్ ఉత్స‌వ్. విదేశాల్లో స‌ర్వ‌సాధారణంగా జ‌రిగే మందు పండుగ‌ను హైద‌రాబాద్ న‌గ‌రానికి సుచిర్స్ క్ల‌బ్ నిర్వాహ‌కులు మొద‌టిసారిగా ప‌రిచ‌యం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మందుబాబుల కోసం మొట్ట‌మొద‌టిసారిగా శుక్ర‌వారం రాత్రి బీర్ ఉత్స‌వ్ జ‌రిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌రు 2 లోని సుచిర్స్ క్ల‌బ్ రిప‌బ్లిక్ లో ఉన్న మోష్‌పిట్‌లో జ‌రిగిన ఈ ఉత్స‌వానికి జంట‌న‌గ‌రాల్లోని మందు ప్రియులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివ‌ల్లో ర‌క‌ర‌కాల మందు బ్రాండ్ల‌తో మోడ‌ళ్లు సంద‌డి చేశారు.

First Published:  19 Jun 2015 1:12 PM GMT
Next Story