కొత్త విలన్ ను పరిచయం చేస్తున్న పవన్

పవన్ సినిమాల్లో పంచ్ లు, హీరోయిజం మాత్రమే కాదు.. విలన్లు కూడా బాగుంటారు. కొన్ని సినిమాల్లో స్టయిలిష్ గా ఉంటే.. మరికొన్ని సినిమాల్లో పవర్ ఫుల్ గా ఉంటారు. అందుకే నటీనటుల ఎంపికలో కూడా జాగ్రత్తగా ఉంటాడు పవన్. పైగా గబ్బర్ సింగ్-2 లాంటి ప్రతిష్టాత్మక సినిమా కోసం మరింత కేర్ తీసుకుంటున్నాడు పవన్. అందుకే ఎన్నో ఆలోచనలు చేసి ఫైనల్ గా విలన్ గా కొత్త వ్యక్తిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హిందీ సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శరద్ కేల్కర్, గబ్బర్ సింగ్-2 సినిమాలో నటించే అవకాశం కొట్టేశాడు. 
                 బాబి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది గబ్బర్ సింగ్-2. ఇప్పటికే పూణే షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సినిమా యూనిట్ అంతా కలిసి రాజస్థాన్ వెళ్లబోతోంది. రాజస్థాన్ షెడ్యూల్ లో పవన్ తో పాటు కొత్త విలన్ కూడా పాల్గొంటాడు. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.