కేసీఆర్ తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ

కేసీఆర్ తో అనురాగ్ శర్మ, డీజీపీతో చంద్రబాబు భేటీ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా రాజ‌కీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు శనివారం పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో డీజీపీ అనురాగ్ శర్మ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసుతోపాటు, టీ న్యూస్ ఛానల్ కు నోటీసులపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ఏసీబీ డీజీతో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రెచ్చగొట్టేలా ప్రసారాలు చేశారంటూ టీ-న్యూస్ ఛానల్ కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అర్థరాత్రి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరువురు సీఎంలు త‌మ త‌మ రాష్ట్రాల డీజీపీల‌తో స‌మావేశమ‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.