Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 119

ఒక జపాన్‌ టూరిస్టు ఇండియా వచ్చాడు. టాక్సీ మాట్లాడుకుని ఢిల్లీ అంతా తిరుగుతున్నాడు. జపాన్‌ “ఫాస్ట్‌”తో కంపేర్‌ చేసుకుంటే ఇండియాలో అంతా మెల్లగా, నెమ్మదిగా సాగుతున్నట్లనిపించింది. చివరికి ఆపుకోలేక టాక్సీ డ్రైవర్‌తో “ఏమిటయ్యా! ఇక్కడ అన్నీ స్లోగా ఉన్నాయి. మీ టాక్సీలు స్లోగా ఉన్నాయి. అదే జపాన్‌లో టాక్సీలు చాలా స్పీడుగా ఉంటాయి. మీ బస్సులు మెల్లగా పిల్లిలా పోతున్నాయి. మీ మోటారు సైకిళ్ళు ఎడ్లబళ్ళలా పోతున్నాయి. జపాన్లో గాల్లో తేలుతాయి” అన్నాడు. సిటీ అంతా చూశాకా […]

ఒక జపాన్‌ టూరిస్టు ఇండియా వచ్చాడు. టాక్సీ మాట్లాడుకుని ఢిల్లీ అంతా తిరుగుతున్నాడు. జపాన్‌ “ఫాస్ట్‌”తో కంపేర్‌ చేసుకుంటే ఇండియాలో అంతా మెల్లగా, నెమ్మదిగా సాగుతున్నట్లనిపించింది. చివరికి ఆపుకోలేక టాక్సీ డ్రైవర్‌తో “ఏమిటయ్యా! ఇక్కడ అన్నీ స్లోగా ఉన్నాయి. మీ టాక్సీలు స్లోగా ఉన్నాయి. అదే జపాన్‌లో టాక్సీలు చాలా స్పీడుగా ఉంటాయి. మీ బస్సులు మెల్లగా పిల్లిలా పోతున్నాయి. మీ మోటారు సైకిళ్ళు ఎడ్లబళ్ళలా పోతున్నాయి. జపాన్లో గాల్లో తేలుతాయి” అన్నాడు.
సిటీ అంతా చూశాకా టూరిస్టు మీటరు చూశాడు. ఐదువందల రూపాయలయింది. టూరిస్టు అదిరిపోయాడు. “మీ మీటర్లేమిటి ఇంత ఫాస్ట్‌గా ఉన్నాయి?” అన్నాడు. టాక్సీడ్రైవర్‌ తాపీగా అవి “మేడిన్‌ జపాన్‌ సార్‌” అన్నాడు.
————————————————————————–
ఒక సర్దార్జీ షాపుకు వెళ్ళి అక్కడున్న ఒక వస్తువును చూసి
“నాకా వీసీఆర్‌ కావాలి” అన్నాడు. షాపు ఓనరు సర్దార్జీని చూసి “సర్దార్జీ! అది మీది కాదు” అన్నాడు. సర్దార్జీ అవమానంగా ఫీలయ్యాడు. షాపు ఓనరు తనను తక్కువ చేసినట్లు బాధపడ్డాడు. మరుసటిరోజు సర్దార్జీ నీట్‌గా గడ్డం గీసుకుని శుభ్రమయిన బట్టలు వేసుకుని వచ్చాడు. “నాకా వీసీఆర్‌ కావాలి” అన్నాడు. షాపు ఓనర్‌ సర్దార్జీ వైపు కనీసం చూడకుండానే సర్దార్జీని గుర్తుపట్టి “సర్దార్జీ! అది నీకోసం కాదు” అన్నాడు.
ఆ షాపు యజమాని తననెట్లా గుర్తుపట్టాడో అర్ధంకాక సర్దార్జీ ఆశ్చర్యపోయాడు. అట్లా కాదని మరుసటిరోజు చీరకట్టుకుని, ముసుగేసుకుని షాపుకు వచ్చి ఆడగొంతుతో “నాకా వీసీఆర్‌ అమ్ముతారా?” అని అడిగాడు.
షాపు ఓనర్‌ వెంటనే “సర్దార్జీ! అది మీది కాదని ముందే చెప్పాను కదా!” అన్నాడు. సర్దార్జీ షాక్‌ తిన్నాడు.
షాపు ఓనర్‌ దగ్గరికి వెళ్ళి “నిన్న గడ్డం గీసుకుని వచ్చినా నన్ను గుర్తుపట్టావు. ఈ రోజు చీరకట్టుకుని వచ్చినా గుర్తుపట్టావు. ఇదెలా వీలుపడింది? అంతేకాక ఆ వీసీఆర్‌ నాకు ఎందుకు అమ్మనంటున్నావు?” అని అడిగాడు.
షాపతను చిరునవ్వు నవ్వాడు.
“సర్దార్జీ! ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. చాలా సింపుల్‌. ఎందుకంటే అది వి.సి.ఆర్‌. కాదు వాషింగ్‌మిషన్‌!” అన్నాడు.
————————————————————————–
సర్దార్జీ బస్సెక్కడానికి ప్రయత్నించి వీలుపడక సిటీబస్‌ వెంట పరిగెట్టాడు. అరగంటకి వగర్చుకుంటూ ఇంటికి వచ్చి భార్యతో తను చేసిన ఘనకార్యం చెప్పి “నాలుగు రూపాయలు ఆదా చేశాను” అన్నాడు.
సర్దార్జీ భార్య సర్దార్జీని చులకనగా చూసి నాలుగు రూపాయలు ఆదా చెయ్యడం గొప్పకాదు. అదే నువ్వు టాక్సీ వెనక పరిగెట్టుకుంటూ వచ్చివుంటే నలభై ఆదా చేసేవాడివి అంది.

First Published:  19 Jun 2015 1:03 PM GMT
Next Story