Telugu Global
National

10 ల‌క్ష‌ల మందితో 21న యోగా డే

దేశంలో తొలిసారి జ‌రుపుతున్న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ప‌ది ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతున్నారు. ఎన్‌సీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ యోగా డేతో గిన్నిస్ రికార్డు న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్నారు. దేశంలోని 1900 కేంద్రాల్లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 27 వంద‌ల కేంద్రాల్లో యోగాపై 15 రోజుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు ఎన్‌సీసీ తెలిపింది. గ‌త ఏప్రిల్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1800 మంది నిపుణుల స‌మ‌క్షంలో యోగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్టు ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. […]

10 ల‌క్ష‌ల మందితో 21న యోగా డే
X

దేశంలో తొలిసారి జ‌రుపుతున్న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ప‌ది ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతున్నారు. ఎన్‌సీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ యోగా డేతో గిన్నిస్ రికార్డు న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్నారు. దేశంలోని 1900 కేంద్రాల్లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 27 వంద‌ల కేంద్రాల్లో యోగాపై 15 రోజుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు ఎన్‌సీసీ తెలిపింది. గ‌త ఏప్రిల్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1800 మంది నిపుణుల స‌మ‌క్షంలో యోగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్టు ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. రేపు రాజ్‌ప‌థ్ వ‌ద్ద నిర్వ‌హించనున్న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ పాల్గొన‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని దూర‌ద‌ర్శ‌న్ విస్త్ర‌తంగా క‌వ‌ర్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. 20 హెచ్‌డీ కెమెరాల‌ను డీడీ వినియోగించ‌నుంది.

First Published:  20 Jun 2015 8:48 AM GMT
Next Story