Telugu Global
Others

ఏపీలో ఎల్ఈడీ బ‌ల్బుల కుంభ‌కోణం? 

వ‌రుస కుంభ‌కోణాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కుదిపేస్తున్నాయి. విద్యుత్ పొదుపు ల‌క్ష్యంగా రాష్ట్రప్ర‌భుత్వం మొద‌లుపెట్టిన సంస్క‌ర‌ణ‌లు కుంభ‌కోణానికి దారితీశాయి. సాధార‌ణ బ‌ల్బుల స్థానంలో ఎల్ఈడీ బ‌ల్బులు ఉప‌యోగిస్తే పెద్ద ఎత్తున విద్యుత్తు ఆదా చేయ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఊద‌ర‌గొట్టింది. విద్యుత్తు ఆదా సంగ‌తేమోగానీ 600 కోట్ల రూపాయ‌ల మేర కుంభ‌కోణం జ‌రిగింద‌ని వార్త‌లొస్తున్నాయి. మార్కెట్‌లో 85 రూపాయ‌ల‌కు ల‌భించే బ‌ల్బ్‌ను 400 రూపాయ‌ల‌కు కొనుగోలు చేస్తున్నార‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2016 లోపు 2 కోట్ల ఎల్ఈడీ బ‌ల్బుల‌ను […]

ఏపీలో ఎల్ఈడీ బ‌ల్బుల కుంభ‌కోణం? 
X
వ‌రుస కుంభ‌కోణాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కుదిపేస్తున్నాయి. విద్యుత్ పొదుపు ల‌క్ష్యంగా రాష్ట్రప్ర‌భుత్వం మొద‌లుపెట్టిన సంస్క‌ర‌ణ‌లు కుంభ‌కోణానికి దారితీశాయి. సాధార‌ణ బ‌ల్బుల స్థానంలో ఎల్ఈడీ బ‌ల్బులు ఉప‌యోగిస్తే పెద్ద ఎత్తున విద్యుత్తు ఆదా చేయ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఊద‌ర‌గొట్టింది. విద్యుత్తు ఆదా సంగ‌తేమోగానీ 600 కోట్ల రూపాయ‌ల మేర కుంభ‌కోణం జ‌రిగింద‌ని వార్త‌లొస్తున్నాయి. మార్కెట్‌లో 85 రూపాయ‌ల‌కు ల‌భించే బ‌ల్బ్‌ను 400 రూపాయ‌ల‌కు కొనుగోలు చేస్తున్నార‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2016 లోపు 2 కోట్ల ఎల్ఈడీ బ‌ల్బుల‌ను ఉచితంగా పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సాధార‌ణ బ‌ల్బు తెచ్చి ఇస్తే ఎల్ఈడీ బ‌ల్బు ఇస్తారు. ప్ర‌తి కుటుంబానికి రెండు వంతున రాష్ట్రంలోని కోటి కుటుంబాల‌కు 2 కోట్ల బ‌ల్బులు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల ఎల్ఈడీ బ‌ల్బులు పంపిణీ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌థ‌కం కింద కొనుగోళ్ల‌లో గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క బ‌ల్బుకు 320 రూపాయ‌ల వంతున అద‌నంగా చెల్లించ‌డ‌మంటే రెండు కోట్ల బ‌ల్బుల‌కు దాదాపు 600 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం న‌ష్టం జ‌రిగింద‌న్న‌మాట‌. ఈ కొనుగోళ్ల గోల్‌మాల్‌లో డిస్క‌మ్‌ల అధికారులే కాక అధికార పార్టీకి చెందిన పెద్ద‌లు కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లొస్తున్నాయి.
First Published:  21 Jun 2015 2:04 AM GMT
Next Story