Telugu Global
Cinema & Entertainment

శివం రెడీ చేసిన రామ్

పండగ చేస్కో సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. ఎన్నాళ్ల నుంచో రామ్ ఎదురుచూస్తున్న మధురమైన విజయాన్నందించింది ఆ సినిమా. ఈమధ్య కాలంలో సరైన కమర్షియల్ హిట్ అందుకోలేకపోయిన రామ్, పండగ చేస్కో మూవీతో నిజంగానే పండగ చేసుకుంటున్నాడు. పోటీనిచ్చే సినిమాలు దరిదాపుల్లో లేకపోవడంతో కలెక్షన్లు కూడా స్టడీగా రాబట్టాడు. ఇదిలా ఉండగా తన తాజా సినిమా ఊపును అలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు రామ్. అందుకే వెంటనే శివం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న […]

శివం రెడీ చేసిన రామ్
X
పండగ చేస్కో సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. ఎన్నాళ్ల నుంచో రామ్ ఎదురుచూస్తున్న మధురమైన విజయాన్నందించింది ఆ సినిమా. ఈమధ్య కాలంలో సరైన కమర్షియల్ హిట్ అందుకోలేకపోయిన రామ్, పండగ చేస్కో మూవీతో నిజంగానే పండగ చేసుకుంటున్నాడు. పోటీనిచ్చే సినిమాలు దరిదాపుల్లో లేకపోవడంతో కలెక్షన్లు కూడా స్టడీగా రాబట్టాడు. ఇదిలా ఉండగా తన తాజా సినిమా ఊపును అలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు రామ్. అందుకే వెంటనే శివం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న శివం సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని స్వయంగా ప్రకటించాడు. గతంలో ఓ సినిమా చేసిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మరో సినిమా విడుదల చేసేవాడు రామ్. కానీ ఈసారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో దుమ్ముదులపాలని డిసైడ్ అయ్యాడు. పైగా పండగ చేస్కో లాంటి హిట్ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంటే కష్టమని భావించి, వెంటనే శివం సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాడు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నశివం సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
First Published:  20 Jun 2015 7:00 PM GMT
Next Story