Telugu Global
Cinema & Entertainment

 ఒకేసారి 2 సినిమాలు

గజనీ కంటే ముందు మాత్రమే సూర్య ఒకేసారి రెండు సినిమాల్ని చేస్తూ వచ్చాడు. గజనీ తర్వాత పూర్తిగా తన స్టయిల్ మార్చేశాడు. కథపై చాలా రోజులు కూర్చునేవాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేవాడు. మొన్నొచ్చిన రాక్షసుడు సినిమా వరకు సూర్య ఇదే పద్దతి ఫాలో అయ్యాడు. అయితే తాజాగా ఈ విలక్షణ హీరో ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టాడు. తన పాత స్టయిల్ లో ఒకేసారి రెండు సినిమాలు […]

 ఒకేసారి 2 సినిమాలు
X
గజనీ కంటే ముందు మాత్రమే సూర్య ఒకేసారి రెండు సినిమాల్ని చేస్తూ వచ్చాడు. గజనీ తర్వాత పూర్తిగా తన స్టయిల్ మార్చేశాడు. కథపై చాలా రోజులు కూర్చునేవాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేవాడు. మొన్నొచ్చిన రాక్షసుడు సినిమా వరకు సూర్య ఇదే పద్దతి ఫాలో అయ్యాడు. అయితే తాజాగా ఈ విలక్షణ హీరో ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టాడు. తన పాత స్టయిల్ లో ఒకేసారి రెండు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం 24 అనే సినిమాతో పాటు సింగం-3ని కూడా పట్టాలెక్కించాడు. హరి దర్శకత్వంలో రాబోతున్న సింగం-3 సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు సూర్య. త్వరలోనే పారిస్ లో ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. రెండు భారీ షెడ్యూల్స్ అక్కడే ముగించాలనుకుంటున్నారు. సింగం-3లో సూర్య సరసన హన్సిక, శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాతో పాటు మధ్యమధ్యలో 24 అనే సినిమాను కూడా పూర్తిచేయాలనుకుంటున్నాడు సూర్య.
First Published:  21 Jun 2015 12:32 AM GMT
Next Story