జర నవ్వండి ప్లీజ్ 120

ఒక బిషప్‌ ఎదురు పడిన కుర్రాళ్ళని “టౌన్‌హాల్‌కు దారి ఎటు?” అని అడిగాడు.
ఆ కుర్రాళ్ళు “మీరు టౌన్‌ హాలుకు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నించారు.
“అక్కడ నేను స్వర్గానికి వెళ్ళేమార్గం గురించి ఉపన్యసించబోతున్నాను” అన్నాడు.
కుర్రాళ్ళు నవ్వుతూ “టౌన్‌హాల్‌కి దారి తెలీనివాడు స్వర్గానికి దారి ఏం తెలుసుకుంటావు?” అన్నారు.
————————————————————-
రాజశేఖర్‌కి ఫోన్‌ వచ్చింది “లక్షరూపాయలు మేము చెప్పే అడ్రస్‌కు పంపకుంటే నీ భార్యను కిడ్నాప్‌ చేస్తాం” అని.
రాజశేఖర్‌: “నా దగ్గర లక్షరూపాయలు లేవు గానీ మీ ప్రయత్నం ఫలించాలని భగవంతుణ్ణి కోరుతున్నా”.
————————————————————-
కస్టమర్‌: వెయిటర్‌! నేను ఆలూపరాటా అడిగాను. దాంట్లో ఆలూ లేనేలేదయ్యా!
వెయిటర్‌: పేరులో ఏముంది సార్‌! కాశ్మీరీ పలావులో కాశ్మీర్‌ ఉంటుందా?

————————————————————-
బంటాసింగ్‌, సంతాసింగ్‌ మిత్రులు. ఒకసారి మాటల్లో దిగి గొప్పలు చెప్పుకుంటున్నారు.
బంటాసింగ్‌ “ఓసారి మా తాత వాచీ బావిలో పడిపోయింది. ముప్పయ్యేళ్ళ తరువాత ఆ వాచీని బయటికి తీస్తే అది అప్పుడు కూడా పనిచేస్తూ కనిపించింది” అన్నాడు.

సంతాసింగ్‌ “దీంట్లో గొప్పతనమేముంది? ఓసారి మా తాతే బావిలో పడిపోయాడు. ముప్పయ్యేళ్ళ తరువాత బయటికి తీశారు. అప్పుడు కూడా బతికే ఉన్నాడు” అన్నాడు.
బంటాసింగ్‌ “అదెట్లా వీలుపడుతుంది. ముప్పయేళ్ళు బావిలో ఏం చేస్తున్నాడు?”
సంతాసింగ్‌ “మీ తాత వాచీ వెతుకుతున్నాడు.”
————————————————————-
విపరీతంగా జలుబున్న రఘు డాక్టర్‌ దగ్గరికెళ్ళి “నాలుగు రోజుల్నించి విపరీతమయిన కోల్డు, మార్గం చెప్పండి” అన్నాడు.
డాక్టర్‌ “చన్నీళ్ళ స్నానం చేసి ఫ్యాను కింద నిల్చో” అన్నాడు.

“అట్లా చేస్తే జలుబు తగ్గుతుందా?”
“అప్పుడు నీకు న్యుమోనియా వస్తుంది. దాన్ని తగ్గిస్తాను”.