Telugu Global
Others

జాడ లేని సండ్ర‌! ఏసీబీ దూకుడు త‌గ్గిందా?

ఓటుకు నోటు ఎర కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య స‌మాచారం ఇంత‌వ‌ర‌కూ తెలియ‌రాలేదు. ఆయ‌న నిజంగానే ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్న‌రా?  లేక ప‌రారీలో ఉన్నారా? అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మొత్తానికి ఆయ‌న జూన్ 19న విచార‌ణ‌కు రాకుండా లేఖ విడుద‌ల చేయ‌డం చూస్తోంటే… ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించ‌డానికి ప్ర‌స్తుతం సిద్ధంగా లేన‌నే సంకేతాలు పంపాడ‌ని పోలీసులు అంచ‌నాకు వ‌చ్చారు. మ‌రోవైపు ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఉన్నాడ‌ని, లేదు […]

జాడ లేని సండ్ర‌! ఏసీబీ దూకుడు త‌గ్గిందా?
X
ఓటుకు నోటు ఎర కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య స‌మాచారం ఇంత‌వ‌ర‌కూ తెలియ‌రాలేదు. ఆయ‌న నిజంగానే ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్న‌రా? లేక ప‌రారీలో ఉన్నారా? అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మొత్తానికి ఆయ‌న జూన్ 19న విచార‌ణ‌కు రాకుండా లేఖ విడుద‌ల చేయ‌డం చూస్తోంటే… ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించ‌డానికి ప్ర‌స్తుతం సిద్ధంగా లేన‌నే సంకేతాలు పంపాడ‌ని పోలీసులు అంచ‌నాకు వ‌చ్చారు. మ‌రోవైపు ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఉన్నాడ‌ని, లేదు విశాఖ‌లో ఉన్నాడ‌ని వ‌స్తోన్న వార్త‌ల వెన‌క వాస్త‌వాలు దేవుడికే ఎరుక‌! పోలీసుల విచార‌ణ ఎదుర్కొనేందుకు ర‌హ‌స్య ప్రాంతంలో శిక్ష‌ణ పొందుతున్నార‌ని ఇంకొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఆయ‌న ఆంధ్ర‌లో త‌ల‌దాచుకుంటే మాత్రం.. అది ఏపీ స‌ర్కారును మ‌రింత ఇబ్బందుల్లోకి నెడుతుంద‌ని, నిందితుల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న ప్రాంతంగా త‌మ రాష్ర్టానికి ముద్ర‌ప‌డుతోంద‌ని ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే భావిస్తున్నారు. ఇదే విష‌య‌మై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ వ్యాఖ్య‌లు చ‌ర్చానీయాంశంగా మారింది. నిందితుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌డం శుభ‌ప‌రిణామం కాద‌ని న్యాయ‌నిపుణులు కూడా హిత‌వు ప‌లుకుతున్నారు. ఒక‌వేళ సండ్ర ఏసీబీ ముందుకు వ‌స్తే.. ఇంత‌కాలం ఎక్క‌డున్నారంటే ఆయ‌న ఇచ్చే స‌మాధానంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న ఆంధ్ర‌లో ఉన్నాన‌ని చెబితే.. ఏపీ స‌ర్కారుకు మ‌రో మచ్చ అవుతుంద‌న‌డంలో సందే హం లేదు.
ద‌ర్యాప్తు వేగం త‌గ్గిందా?
ఏసీబీ విచార‌ణ వేగం మంద‌గించింది. ద‌ర్యాప్తులో ఈ వారం మొద‌ట్లో క‌నిపించిన వేడి ఇప్పుడు చ‌ల్లారిన‌ట్లే క‌నిపిస్తోంది. నిజంగానే దీని వెన‌క డీల్ కుదిరిందా? అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. ఢిల్లీలో కేటీఆర్‌తో, టీడీపీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి స‌మావేశ‌మ‌య్యారు. ఇది సాధార‌ణ‌ స‌మ‌వేశ‌మేన‌ని చెబుతున్నా.. స‌మావేశం అనంత‌రం ఏసీబీ దూకుడు త‌గ్గిన వైనం చూసి ప్ర‌జ‌ల మ‌న‌స్సులో అనేక అనుమానాలు రేగుతున్నాయి. చంద్ర‌బాబుకు సైతం నోటీసులు అందుతున్నాయ‌నుకున్న క్ర‌మంలో ఏసీబీ వేగం త‌గ్గ‌డం ఇప్పుడు అనేక అనుమానాలకు కార‌ణ‌మ‌వుతోంది. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. తెలంగాణ‌లో టీ-న్యూస్ చాన‌ల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయ‌డం క‌లక‌లం రేగింది. శ‌నివారం సాయంత్రం ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు గ‌వ‌ర్న‌ర్ ను గంగిరెద్దు అని మ‌రోసారి సంబోధించి వివాదం ఇంకా చ‌ల్లార‌లేద‌ని సంకేతాలు పంపారు. ఏసీబీ దూకుడు త‌గ్గిందా..? వ‌్యూహాత్మ‌కంగా వెన‌క్కి త‌గ్గిందా? అన్న‌ది ఏసీబీ త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను బ‌ట్టి తేలిపోనుంది.
First Published:  21 Jun 2015 1:30 AM GMT
Next Story