Telugu Global
Others

యోగాల‌యంగా మారిన హ‌స్తిన‌

దేశ రాజ‌ధాని ఢిల్లీ యోగాల‌యంగా మారిపోయింది. రాజ్‌ప‌థ్ ప్ర‌ధాన వేదిక‌గా జ‌రిగిన ఈ వేడుక‌లో దాదాపు 50 వేల మంది పాల్గొని ఆరోగ్య‌దాయ‌నిగా యోగాని చాటి చెప్పారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ముందు వ‌రుస‌లో కూర్చుని అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ఆయ‌న స్వ‌యంగా యోగాస‌నాలు వేస్తూ తొలి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. అంతకుముందు ప్రధాని అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్‌పథ్ యోగాపథ్ అవుతుందని ఏనాడైనా ఊహించారా? అని ప్ర‌శ్నించారు. శాంతి, సద్భావనను పెంపొందిండం కోసమే యోగా […]

యోగాల‌యంగా మారిన హ‌స్తిన‌
X
దేశ రాజ‌ధాని ఢిల్లీ యోగాల‌యంగా మారిపోయింది. రాజ్‌ప‌థ్ ప్ర‌ధాన వేదిక‌గా జ‌రిగిన ఈ వేడుక‌లో దాదాపు 50 వేల మంది పాల్గొని ఆరోగ్య‌దాయ‌నిగా యోగాని చాటి చెప్పారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ముందు వ‌రుస‌లో కూర్చుని అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ఆయ‌న స్వ‌యంగా యోగాస‌నాలు వేస్తూ తొలి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. అంతకుముందు ప్రధాని అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్‌పథ్ యోగాపథ్ అవుతుందని ఏనాడైనా ఊహించారా? అని ప్ర‌శ్నించారు. శాంతి, సద్భావనను పెంపొందిండం కోసమే యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ యోగా ఒక రోజుకు మాత్ర‌మే పరిమితం కాదని అన్నారు. ప్రజాజీవితంలో యోగా సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సమస్యలను యోగా దూరం చేస్తుందని, మానసిక వికాసాన్ని కలిగించి అంతః స్సౌందర్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ముందుగా అక్కడున్నవారితో సూక్ష్మ వ్యాయామం, శ్వాసతో ముడిపడిన పలు యోగా ప్రక్రియలు చేయించారు. అందరికీ అర్థమయ్యేలా హిందీ, ఆంగ్ల భాషల్లో సూచనలిచ్చారు. తాడాసనం, వృక్షాసనం, పాద హస్తాసనం, అర్థ చక్రాసనం, త్రికోణాసనం, దండాసనం, వక్రాసనం వంటి పలు ఆసనాలు వేయిస్తూ… ఈ ఆసనాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు.యోగా ద్వారా ఏ వ్యాధులను నివారించుకోవచ్చో తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రులు, ఎంపీలు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు
ప్రపంచ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం ప్రధాన వేదికగా జరిగింది. నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, యువతీ యువకులు పాల్గొని యోగా చేశారు. ముందుగా ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ధ్యానం తదితర యోగ ప్రక్రియలతో నిర్వాహకులు అందరితోనూ ఆసనాలు వేయించారు. అందరూ సులభంగా వేయగలిగే శశాంకాసనం, భుజంగాసనం, మకరాసనం, శవాసనం తదితర ఆసనాలు చేయించారు. ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం, ధ్యానం చేయించి వాటి వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను తెలియజేశారు.
First Published:  21 Jun 2015 12:00 AM GMT
Next Story