Telugu Global
Others

ఆప్ఘ‌న్ పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదుల పంజా

అప్ఘ‌నిస్థాన్ పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని ఛేదించుకుని వీరు ప్ర‌ధాన ద్వారంలోకి ప్ర‌వేశించి ఆత్మాహుతి దాడికి ప్ర‌య‌త్నించారు. అయితే పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించే ముందే ఆత్మాహుతికి వ్య‌క్తి పాల్ప‌డ‌డంతో అక్క‌డున్న చాలా కార్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఉగ్ర‌వాదుల దాడిలో ఆరుగురు పార్ల‌మెంట్ సిబ్బంది అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌ర నుంచే వారు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్ళిన ఉగ్ర‌వాదులు పార్ల‌మెంట్ సిబ్బంది క‌నిపించ‌గానే వారిపై కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఓ […]

ఆప్ఘ‌న్ పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదుల పంజా
X
అప్ఘ‌నిస్థాన్ పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని ఛేదించుకుని వీరు ప్ర‌ధాన ద్వారంలోకి ప్ర‌వేశించి ఆత్మాహుతి దాడికి ప్ర‌య‌త్నించారు. అయితే పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించే ముందే ఆత్మాహుతికి వ్య‌క్తి పాల్ప‌డ‌డంతో అక్క‌డున్న చాలా కార్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఉగ్ర‌వాదుల దాడిలో ఆరుగురు పార్ల‌మెంట్ సిబ్బంది అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌ర నుంచే వారు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్ళిన ఉగ్ర‌వాదులు పార్ల‌మెంట్ సిబ్బంది క‌నిపించ‌గానే వారిపై కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఓ ప‌థ‌కం ప్ర‌కారమే ఉగ్ర‌వాదులు త‌మ పంజా విసిరారు. చుట్టుప‌క్క‌ల భ‌వ‌నాల‌పై నుంచి కూడా ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జోరుగా కాల్పులు జ‌రుగుతున్నాయి. పార్ల‌మెంట్ భ‌వ‌నం లోప‌ల కూడా బాంబు దాడులు జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు. దిగువ స‌భ‌లోకి ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ఇందులో ప‌లువురు ఎంపీల‌కు గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపార‌ని అన‌ధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ ప్రాంత‌మంతా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట్ బ‌య‌ట మొత్తం ఆరు చోట్ల బాంబు దాడులు జ‌రిగాయి. ఈ సంఘ‌ట‌న‌ల‌తో అక్క‌డ భీతావాహ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఆ ప్రాంత‌మంతా కాల్పుల‌తో ప్ర‌తిధ్వ‌నిస్తోంది. పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను సుర‌క్షితంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ దాడుల‌కు పాల్ప‌డింది తామేన‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. మామూలుగా అమెరికా ద‌ళాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు నిర్వ‌హించే తాలిబ‌న్లు ఈసారి ఏకంగా పార్ల‌మెంట్ భ‌వ‌నంపైనే దాడికి దిగారంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్ధం చేసుకోవ‌చ్చు. అప్ఘ‌న్ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ అష్రాప్ ఘ‌నీపై దాడిగా దీన్ని వ‌ర్ణిస్తున్నారు. ఇది ఖ‌చ్చితంగా ప్ర‌జాస్వామ్యాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య‌గా భావిస్తున్నారు.
First Published:  22 Jun 2015 2:20 AM GMT
Next Story