Telugu Global
Cinema & Entertainment

మీడియాపై కొత్త హీరో దాడి

సాధారణంగా మీడియాపై విరుచుకుపడే ధైర్యం, హక్కు స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. వెబ్ సైట్లు, ఛానెళ్లపై ఆగ్రహం చూపించింది ఇప్పటివరకు స్టార్లు మాత్రమే. కానీ ఫస్ట్ టైమ్ ఓ కొత్త హీరో కూడా మీడియాపై దాడికి దిగాడు. అసలు ఏం రాస్తున్నారు.. ఏం చూపిస్తున్నారంటూ మీడియాపైనే విరుచుకుపడ్డాడు. ఈమధ్యే టిప్పు అనే సినిమాతో వెండితెరపైకొచ్చాడు కొత్త హీరో కార్తీక్. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరపైకొచ్చిన ఈ హీరో తొలి సినిమా అస్సలు బాగాలేదు. అదే విషయాన్ని […]

మీడియాపై కొత్త హీరో దాడి
X
సాధారణంగా మీడియాపై విరుచుకుపడే ధైర్యం, హక్కు స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. వెబ్ సైట్లు, ఛానెళ్లపై ఆగ్రహం చూపించింది ఇప్పటివరకు స్టార్లు మాత్రమే. కానీ ఫస్ట్ టైమ్ ఓ కొత్త హీరో కూడా మీడియాపై దాడికి దిగాడు. అసలు ఏం రాస్తున్నారు.. ఏం చూపిస్తున్నారంటూ మీడియాపైనే విరుచుకుపడ్డాడు. ఈమధ్యే టిప్పు అనే సినిమాతో వెండితెరపైకొచ్చాడు కొత్త హీరో కార్తీక్. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరపైకొచ్చిన ఈ హీరో తొలి సినిమా అస్సలు బాగాలేదు. అదే విషయాన్ని వెబ్ సైట్లు రాశాయి. ఛానెళ్లు చూపించాయి. దీంతో కార్తీక్ కు చిర్రెత్తుకొచ్చింది. మీకు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రాదంటూ కొన్ని మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోశాడు కార్తిక్. మరికొందరినయితే రివ్యూలు రాయడం నేర్చుకోండంటూ నేరుగానే విమర్శించాడు. కొన్ని మీడియా సంస్థలు టిప్పు సినిమాను తుప్పుగా పేర్కొనడంతోనే కార్తీక్ కు ఇలా చిర్రెత్తుకొచ్చింది.
First Published:  21 Jun 2015 7:16 PM GMT
Next Story