Telugu Global
Others

సండ్ర రాజ‌మండ్రిలో ఉన్నారా?

ఖ‌మ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య రాజ‌మండ్రిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌న్న వార్త‌లు క‌ల‌కలం రేపుతున్నాయి. ఓటుకు నోటు ఎర కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర  విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా త‌ప్పించుకు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే! ఆయ‌న రాజ‌మండ్రిలోని బొల్లినేని ఆసుప‌త్రిలో వైద్య‌ప‌రీక్ష‌ల కోసం ఆదివారం వ‌చ్చార‌ని, విలేక‌రులు వెళ్ల‌గానే ఆయ‌న అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌ని ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాలు టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ కేసులో నిందితులంద‌రినీ ఏపీ సీఎం చంద్ర‌బాబు కాపాడేందుకు […]

సండ్ర రాజ‌మండ్రిలో ఉన్నారా?
X
ఖ‌మ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య రాజ‌మండ్రిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌న్న వార్త‌లు క‌ల‌కలం రేపుతున్నాయి. ఓటుకు నోటు ఎర కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా త‌ప్పించుకు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే! ఆయ‌న రాజ‌మండ్రిలోని బొల్లినేని ఆసుప‌త్రిలో వైద్య‌ప‌రీక్ష‌ల కోసం ఆదివారం వ‌చ్చార‌ని, విలేక‌రులు వెళ్ల‌గానే ఆయ‌న అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌ని ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాలు టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ కేసులో నిందితులంద‌రినీ ఏపీ సీఎం చంద్ర‌బాబు కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ప‌రారీలో ఉన్న జెరుస‌లేం మ‌త్త‌య్య‌కు ఏపీ పోలీసులు, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ మ‌ద్ద‌తుగా నిల‌వడం జాతీయ‌స్థాయిలో ఏపీ స‌ర్కారును తీవ్ర విమ‌ర్శ‌ల పాలుజేసింది. ప‌రారీలో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఆంధ్ర‌లో ఉన్నారని మొద‌టి నుంచి అనుమానాలు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న రాజ‌మండ్రిలో ఉన్నారంటూ వ‌స్తోన్న వార్త‌లు ఏపీ సీఎంకు మ‌రింత మ‌చ్చ తెచ్చిపెట్టాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విష‌యంలో ఏపీ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చినా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న‌ది బ‌హిరంగ వాస్త‌వం. నిందితులంద‌రికీ ఏపీ పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ వ‌స్తోండ‌టంతో ఈ ప్ర‌య‌త్నాలు వృథా ప్ర‌యాసేన‌ని తెలంగాణ పోలీసులు విష‌యాన్ని కోర్టుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మొత్తానికి ఏపీ పోలీసుల తీరు దేశ ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ తెచ్చేలా ఉంద‌ని ప‌లువురు సీనియ‌ర్ పోలీసులు అధికారులు విమ‌ర్శిస్తున్నా ఏపీ స‌ర్కారు లెక్క‌చేయ‌డం లేదు. నిందితుల‌ను కాపాడే కొత్త సంస్కృతికి తెర‌తీశారు. అయితే, ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఎప్పుడు పోలీసుల ముందుకు వ‌స్తాడు? అస‌లు వ‌స్తాడా? రాడా? ఆయ‌న అజ్ఞాతంలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది అన్న‌ది చ‌ర్చానీయాంశంగా మారింది.
First Published:  21 Jun 2015 11:09 PM GMT
Next Story