Telugu Global
Others

విశాఖ ఎయిర్‌పోర్టులో 63 కేజీల బంగారం పట్టివేత!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో చరిత్రలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మ‌లేషియా, సింగ‌పూర్‌ల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల నుంచి 63 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 17 కోట్ల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిన దాఖలాలు లేవు.  ఇప్పటివరకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ఇపుడిపుడే […]

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో చరిత్రలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మ‌లేషియా, సింగ‌పూర్‌ల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల నుంచి 63 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 17 కోట్ల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ఇపుడిపుడే విశాఖ విమానాశ్రయం వైపు మళ్ళుతుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. మామూలుగా ఇక్కడకు వచ్చేది సాధారణ ప్రయాణీకులే. వీరు పెద్ద మొత్తంలో స్మగ్లంగ్‌కు పాల్పడే అవకాశాలు తక్కువ. కాని ఇపుడు హైదరాబాద్‌లో నిఘా పెరగడం, ఎక్కువ మంది స్మగ్లర్లు దొరికిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధాన విమానాశ్రయం అయిన విశాఖ వైపు వారి దృష్టి పడింది. సాధారణంగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్‌ చేసేందుకు అంతర్జాతీయ విమానాలు వేదిక అవుతాయి. ఇప్పుడిప్పుడే విశాఖకు విదేశీ విమానాల రాకపోకలు పెరగడంతో.. స్మగ్లర్లు కూడా ఈ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఈ నెలలోనే 2.5 కోట్ల విలువైన బంగారం తనిఖీల్లో పట్టుబడింది. విశాఖ విమానాశ్రయంలో ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం ఆనాటికి అదే రికార్డు. ఇపుడు మరో కొత్త రికార్డు నమోదైంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ ప్రధానంగా దుబాయ్‌ నుంచి కొనసాగుతోంది. దుబాయ్‌లో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడి నుంచి స్మగ్లింగ్ తేలికగా జరుగుతుందన్న వాదన ఉంది.
First Published:  22 Jun 2015 4:09 AM GMT
Next Story