Telugu Global
Cinema & Entertainment

నిన్న జ్యోతిలక్ష్మి.. రేపు మంత్ర-2

జ్యోతిలక్ష్మి సినిమాకు ఎంత లాభమొచ్చిందనే విషయాన్ని పక్కనబెడితే.. ఆ మూవీకి పబ్లిసిటీ మాత్రం బాగా చేశారు. సినిమాకు హైప్ కూడా బాగా వచ్చింది. సినిమా కూడా వారం రోజుల పాటు స్టడీగా ఆడింది. దీంతో ఎన్నాళ్ల నుంచో మూలుగుతున్న మంత్ర-2 సినిమాను కూడా గ్యాప్ లేకుండా విడుదల చేసేయాలని డిసైడైంది చార్మి. జ్యోతిలక్ష్మి మేనియా కొనసాగుతుండగానే మంత్ర-2ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 3న మంత్ర-2 థియేటర్లలోకి వస్తుంది. మంత్ర సినిమాతో […]

నిన్న జ్యోతిలక్ష్మి.. రేపు మంత్ర-2
X
జ్యోతిలక్ష్మి సినిమాకు ఎంత లాభమొచ్చిందనే విషయాన్ని పక్కనబెడితే.. ఆ మూవీకి పబ్లిసిటీ మాత్రం బాగా చేశారు. సినిమాకు హైప్ కూడా బాగా వచ్చింది. సినిమా కూడా వారం రోజుల పాటు స్టడీగా ఆడింది. దీంతో ఎన్నాళ్ల నుంచో మూలుగుతున్న మంత్ర-2 సినిమాను కూడా గ్యాప్ లేకుండా విడుదల చేసేయాలని డిసైడైంది చార్మి. జ్యోతిలక్ష్మి మేనియా కొనసాగుతుండగానే మంత్ర-2ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 3న మంత్ర-2 థియేటర్లలోకి వస్తుంది. మంత్ర సినిమాతో ఘనవిజయం అందుకుంది చార్మి. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో అదే పంథాలో చాలా సినిమాలొచ్చాయి. చార్మి కూడా మంత్ర సినిమాకు వెంటనే సీక్వెల్ రెడీ చేయాలనుకుంది. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. చాన్నాళ్లుగా ల్యాబ్ లోనే నలుగుతున్న ఈ సినిమాను జ్యోతిలక్ష్మి హవా కొనసాగుతున్న టైమ్ లోనే విడుదల చేస్తే బెటరని భావిస్తున్నారు మేకర్. జ్యోతిలక్ష్మి సినిమాకు సంగీతం అందించిన సునీల్ కశ్యపే.. మంత్ర-2కు కూడా మ్యూజిక్ అందించాడు.
First Published:  21 Jun 2015 8:20 PM GMT
Next Story