Telugu Global
Cinema & Entertainment

స్పీడుపెంచిన నాని

చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బందిపడిన నాని ఇప్పుడు స్పీడు పెంచాడు. వరుసగా సినిమాలకు కమిటవుతున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఇప్పుడు మరోసారి కమర్షియల్ జోనర్ లోకి ఎంటరయ్యాడు నాని. ఇప్పటికే దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమాను దాదాపు పూర్తిచేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ షురూ అవుతుంది. ఇంతలోనే మరో సినిమా మొదలుపెట్టాడు నాని. అందాల రాక్షసి సినిమాతో పేరుతెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేశాడు. 14-రీల్స్ బ్యానర్ […]

స్పీడుపెంచిన నాని
X
చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బందిపడిన నాని ఇప్పుడు స్పీడు పెంచాడు. వరుసగా సినిమాలకు కమిటవుతున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఇప్పుడు మరోసారి కమర్షియల్ జోనర్ లోకి ఎంటరయ్యాడు నాని. ఇప్పటికే దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమాను దాదాపు పూర్తిచేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ షురూ అవుతుంది. ఇంతలోనే మరో సినిమా మొదలుపెట్టాడు నాని. అందాల రాక్షసి సినిమాతో పేరుతెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేశాడు. 14-రీల్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠిని తెలుగుతెరకు పరిచయం చేసిన హను, నాని మూవీతో మరో బ్యూటీని వెండితెరకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శకుడు అదే పనిలో ఉన్నాడు. అందాల రాక్షసిలా ప్రయోగాలకు పోకుండా.. పక్కా కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా ఉంటుందంటున్నాడు నాని.
First Published:  21 Jun 2015 8:00 PM GMT
Next Story