Telugu Global
National

మ‌రో వివాదంలో సుష్మా స్వ‌రాజ్!

2009, 2013 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ల నియామ‌కాల్లో సుష్మా స్వ‌రాజ్ కుటుంబం ల‌బ్ది పొందింద‌న్న విష‌యం ఇపుడు ఆమెకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ల‌లిత్ మోడికి వీసా ఇప్పించేరంటూ పీక‌ల్లోతు ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న సుష్మ మ‌రో వివాదంలో చిక్కుకోవ‌డానికి ఇది కార‌ణం కానుంది. అజ‌య్ దుబే అనే సామాజిక కార్య‌క‌ర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద రాబ‌ట్టిన వివ‌రాల్లో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. ఆమె భ‌ర్త స్వ‌రాజ్ కౌశ‌ల్‌ను, కుమార్తె […]

మ‌రో వివాదంలో సుష్మా స్వ‌రాజ్!
X
2009, 2013 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ల నియామ‌కాల్లో సుష్మా స్వ‌రాజ్ కుటుంబం ల‌బ్ది పొందింద‌న్న విష‌యం ఇపుడు ఆమెకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ల‌లిత్ మోడికి వీసా ఇప్పించేరంటూ పీక‌ల్లోతు ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న సుష్మ మ‌రో వివాదంలో చిక్కుకోవ‌డానికి ఇది కార‌ణం కానుంది. అజ‌య్ దుబే అనే సామాజిక కార్య‌క‌ర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద రాబ‌ట్టిన వివ‌రాల్లో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. ఆమె భ‌ర్త స్వ‌రాజ్ కౌశ‌ల్‌ను, కుమార్తె బ‌న్సూర్ కౌశ‌ల్‌ను మ‌ధ్యప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నేరుగా ప్ర‌భుత్వ ఫ్లీడ‌ర్లుగా నియ‌మించింద‌ని ఈ స‌మాచార హ‌క్కు చ‌ట్టం వివరాల్లో బ‌య‌ట‌ప‌డింది. దీంతో మ‌రోసారి వివాదాల్లోకి ఆమె వెళ్ళిన‌ట్ట‌య్యింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కుమ్మ‌డిగా దాడికి దిగింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అధికార దుర్వినియోగానికి బీజేపీ ప్ర‌భుత్వం పాల్ప‌డి అర్హ‌త‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఈ నియామ‌కాలు చేప‌ట్టింద‌ని విప‌క్షాలు దుయ్య‌బ‌డుతున్నాయి. అయితే మెరిట్ ఆధారంగానే వీరిద్ద‌రి నియామ‌కాలు జ‌రిపిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. సుష్మా స్వ‌రాజ్ ల‌క్ష్యంగా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ‌ని, ఆమెని ఇబ్బంది పెట్ట‌డ‌మే ఈ విమ‌ర్శ‌ల వెనుక ఉద్దేశ్య‌మ‌ని బీజేపీ వ‌ర్గాలు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగాయి.
First Published:  21 Jun 2015 11:07 PM GMT
Next Story