Telugu Global
NEWS

వ‌రంగ‌ల్ బ‌రిలో సైకిల్ లేన‌ట్టే!

క‌డియం శ్రీ‌హ‌రి రాజీనామాతో వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానం ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స్థానంలో పోటీ చేసేందుకు అప్పుడే కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ నాయ‌కులు  పోటీలు ప‌డుతున్నారు. ఏడాదికాలంలో మ‌రోసారి పోటీ చేసే అవ‌కాశం వ‌స్తే దేశంలో ఏ నేతా వ‌దులుకోడు. మ‌రి టీడీపీ మాత్రం అస‌లు పోటీలో నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఓటుకు నోటు ఎర కేసులో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నించారన్న‌కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. […]

వ‌రంగ‌ల్ బ‌రిలో సైకిల్ లేన‌ట్టే!
X

క‌డియం శ్రీ‌హ‌రి రాజీనామాతో వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానం ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స్థానంలో పోటీ చేసేందుకు అప్పుడే కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ నాయ‌కులు పోటీలు ప‌డుతున్నారు. ఏడాదికాలంలో మ‌రోసారి పోటీ చేసే అవ‌కాశం వ‌స్తే దేశంలో ఏ నేతా వ‌దులుకోడు. మ‌రి టీడీపీ మాత్రం అస‌లు పోటీలో నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఓటుకు నోటు ఎర కేసులో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నించారన్న‌కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈకేసులో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పాత్ర కూడా తేట‌తెల్ల‌మైందంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాకు మొహం చాటేస్తున్నారు. ట్యాపింగ్ అంటూ ఇంత‌కాలం చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని తేల‌డంతో జ‌నాల‌కు ఏం చెప్పాలో టీడీపీ నేత‌ల‌కు పాలుపోవ‌డం లేదు. పైగా ఇప్పుడు వ‌రంగ‌ల్ స్థానానికి ఖాళీ ఏర్ప‌డ్డా పార్టీలో దానిపై ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. దీంతో వ‌రంగ‌ల్ బ‌రిలో సైకిల్ లేన‌ట్లే క‌న‌బ‌డుతోంది. దీన్ని ఇంత‌వ‌ర‌కూ ఆ పార్టీ స‌మ‌ర్థించ‌డం కానీ, ఖండించ‌డం గానీ జ‌ర‌గ‌క‌పోవ‌డం ఈ అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. ఒక వేళ పోటీ చేసినా ఏ నినాదంతో ప్ర‌జ‌ల ముందుకెళ్లార‌ని టీఆర్ ఎస్ ప్ర‌శ్నిస్తోంది.

మొద‌టి నుంచీ అంతే..!
తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. కానీ, చంద్ర‌బాబు మొద‌టి నుంచి రెండు క‌ళ్ల సిద్ధాంతం అంటూ ‘ఆ విధంగా ముందుకు పోవ‌డం’ పుట్టిముంచింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా చేజారారు. 2010లో తొలుత ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ మొద‌లైన ఈ ప‌ర్వం మొన్న మాధ‌వ‌రం కృష్ణారావు దాకా కొన‌సాగుతూనే ఉంది. చంద్ర‌బాబు ఏనాడూ తెలంగాణ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు.. వ్య‌వ‌హ‌రించిన‌ట్లు న‌టించారంతే! బిల్లు పాస‌య్యేముందు కూడా బీజేపీని మ‌చ్చిక చేసుకుని అడ్డుపుల్ల వేయించారు. స‌భ‌లో మెజారిటీ లేకున్నా.. వెంకయ్య‌నాయుడు త‌న వాగ్దాటితో తెలంగాణ‌వాసుల‌ను అస‌లు బిల్లు పాస‌వుతుందా? లేదా అన్న సందిగ్దంలో ప‌డేయించారు. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ15 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వ‌డం చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్దాంత ఫ‌లిత‌మే. పార్టీ ఫిరాయింపుల‌తో ఇప్పుడు ఆ సంఖ్య 11కు ప‌డిపోయింది. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాల‌కు తెలంగాణ టీడీపీ నేత‌లు ఆరేళ్లుగా ఇబ్బందులు ప‌డుతున్నారు. టీడీపీని స‌మ‌ర్థించే బ‌ల‌మైన మీడియా అండ‌దండ‌ల‌తో ఆపార్టీ ఇంత‌కాలం తెలంగాణ‌లో నెగ్గుకు వ‌చ్చింది. మ‌రి ఇక‌పై ఎలా ముందుకు సాగుతారో?

First Published:  22 Jun 2015 1:25 AM GMT
Next Story