Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 121

సర్దార్జీని టికెట్‌ కలెక్టర్‌ టికెట్‌ అడిగాడు. సర్దార్జీ “కుడివైపు జేబులో ఉన్నది ఇవ్వాలా? ఎడమవేపు పాకెట్లోది ఇవ్వాలా?” అని అడిగాడు. టీ.సి. కుడివైపు పాకెట్‌లోది చూపమన్నాడు. సర్దార్జీ చూపాడు. టీ.సి చెక్‌ చేశాడు. కరెక్ట్‌గానే ఉంది. తరువాత ఎడంవేపు పాకెట్‌లోని టికెట్‌ అడిగాడు. సర్దార్జీ చూపాడు. అది కూడా కరెక్ట్‌గానే ఉంది. “ఎవరయినా ఒక టికెట్‌ కొట్టేస్తే ఉంటుందని ఇంకొకటి కొన్నాను” అన్నాడు సర్దార్జీ. “మరి ఎవరయినా రెండు టికెట్లు దొంగిలిస్తే?” టీ.సి. సందేహం వ్యక్తం చేశాడు. […]

సర్దార్జీని టికెట్‌ కలెక్టర్‌ టికెట్‌ అడిగాడు. సర్దార్జీ “కుడివైపు జేబులో ఉన్నది ఇవ్వాలా? ఎడమవేపు పాకెట్లోది ఇవ్వాలా?” అని అడిగాడు.
టీ.సి. కుడివైపు పాకెట్‌లోది చూపమన్నాడు. సర్దార్జీ చూపాడు. టీ.సి చెక్‌ చేశాడు. కరెక్ట్‌గానే ఉంది.
తరువాత ఎడంవేపు పాకెట్‌లోని టికెట్‌ అడిగాడు. సర్దార్జీ చూపాడు. అది కూడా కరెక్ట్‌గానే ఉంది. “ఎవరయినా ఒక టికెట్‌ కొట్టేస్తే ఉంటుందని ఇంకొకటి కొన్నాను” అన్నాడు సర్దార్జీ.
“మరి ఎవరయినా రెండు టికెట్లు దొంగిలిస్తే?” టీ.సి. సందేహం వ్యక్తం చేశాడు.
“మూడో టికెట్‌ నా సాక్స్‌లో దాచాను” అన్నాడు తెలివిగా సర్దార్జీ.
————————————————————-
గవర్నమెంటు ఆఫీసు ముందున్న బోర్డులో ఇలా రాశారు “నిశ్శబ్దంగా ఉండండి”.
దానికింద ఎవరో ఇంకో వాక్యం చేర్చారు “లేకుంటే నిద్రపోయేవాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది.”
————————————————————-
ఒక రాజకీయ నాయకుడు విజయవంతంగా ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని ఎయిర్‌పోర్టులో దిగాడు. విలేఖరులు ఆయన్ని చుట్టుముట్టారు. ఇంగ్లాండు ప్రజల గురించి వాళ్ళు అడిగారు.
రాజకీయవేత్త “వాళ్ళు చాలా అదృష్టవంతులు. అరే! అక్కడ రెండేళ్ళ పాప కూడా ఇంగ్లీషు మాట్లాడుతుంది!” అన్నాడు ఆశ్చర్యంగా.
————————————————————-
స్కూల్లో పెన్సిల్‌ దొంగిలించి వచ్చిన కొడుక్కి బుద్ధి చెబుతూ తండ్రి “చూడు నాన్నా! నువ్వు స్కూల్లో దొంగతనం చెయ్యకూడదు. నీకు నోటుబుక్కు, పెన్ను, పెన్సిలు లాంటి అవసరమయ్యాయనుకో, వాటిని నీకోసం నేను ఆఫీసునించి తెస్తాను కదా” అన్నాడు.

First Published:  21 Jun 2015 1:03 PM GMT
Next Story