Telugu Global
Others

పాత నోట్లకు పది రోజులే గ‌డువు

మరో పది రోజుల్లో 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన కరెన్సీ నోట్ల‌కు కాలం చెల్లుతుంది. ఇంక ప‌ది రోజులు మాత్రమే ఈ నోట్లు చెలామణి అవుతాయి. అందుకే వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆ నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోండి. లేదా మీ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయండి. ఎందుకంటే మరో పది రోజుల్లో రిజర్వు బ్యాంక్‌ మీటిని చలామణిలోంచి ఉపసంహరిస్తోంది. ఈ నెలాఖరు వరకే గడువు. జూన్‌ 30 తర్వాత వీటికి పూచిక […]

పాత నోట్లకు పది రోజులే గ‌డువు
X
మరో పది రోజుల్లో 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన కరెన్సీ నోట్ల‌కు కాలం చెల్లుతుంది. ఇంక ప‌ది రోజులు మాత్రమే ఈ నోట్లు చెలామణి అవుతాయి. అందుకే వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆ నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోండి. లేదా మీ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయండి. ఎందుకంటే మరో పది రోజుల్లో రిజర్వు బ్యాంక్‌ మీటిని చలామణిలోంచి ఉపసంహరిస్తోంది. ఈ నెలాఖరు వరకే గడువు. జూన్‌ 30 తర్వాత వీటికి పూచిక పుల్ల విలువ కూడా ఉండదు. ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల నోట్ల వరకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ నోట్లను గుర్తించడం ఎలాగంటే… నోటుపై గాంధీ బొమ్మకు వెనకవైపు మధ్య భాగంలో కింద ఆ నోటు ఏ సంవత్సరంలో ముద్రించారనే విషయం ఉంటుంది. అది లేకపోతే ఆ నోట్లన్నీ 2005కు ముందు ముద్రించినవ‌ని అర్థం. ఇలాంటి నోట్లలో భద్రతా అంశాలు తక్కువగా ఉండడంతో చాలామంది దాదాపు అవే ఫీచర్లతో దొంగ నోట్లు ప్రింట్‌ చేసి చలామణి చేస్తున్నారు. దీంతో ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించాలని రిజర్వు బ్యాంక్‌ నిర్ణయించింది. నిజానికి ఈ సంవత్సరం జనవరి 1 నాటికే ఈ పని పూర్తి కావాల్సి ఉంది. అయితే చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియక పోవడంతో గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ సంవత్సరం జనవరి నాటికే ఆర్‌బిఐ రూ.21,750 కోట్ల విలువైన ఇలాంటి నోట్లను సేకరించి వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేసింది.
First Published:  22 Jun 2015 5:37 AM GMT
Next Story