Telugu Global
Cinema & Entertainment

వరుణ్ సినిమాకు షాకింగ్ టైటిల్

దర్శకుడు పూరి జగన్నాధ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు ఓ షాకింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. కథకు తగ్గట్టు ఈ సినిమాకు లోఫర్ అనే టైటిల్ ను అనుకున్నట్టు తెలుస్తోంది. పూరి సినిమాల్లో టైటిల్స్ అన్నీ కాస్త నెగెటివ్ టచ్ తో ఎగ్రెసివ్ గానే ఉంటాయి. కానీ లోఫర్ అనే టైటిల్ మాత్రం నిజంగా […]

వరుణ్ సినిమాకు షాకింగ్ టైటిల్
X
దర్శకుడు పూరి జగన్నాధ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు ఓ షాకింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. కథకు తగ్గట్టు ఈ సినిమాకు లోఫర్ అనే టైటిల్ ను అనుకున్నట్టు తెలుస్తోంది. పూరి సినిమాల్లో టైటిల్స్ అన్నీ కాస్త నెగెటివ్ టచ్ తో ఎగ్రెసివ్ గానే ఉంటాయి. కానీ లోఫర్ అనే టైటిల్ మాత్రం నిజంగా తిట్టులానే ఉంది తప్ప, హీరోయిజం యాంగిల్ లో అస్సలు లేదు. ఇంతకుముందు పోకిరి, టెంపర్ లాంటి టైటిల్స్ పెట్టినప్పటికీ అవి వివాదాస్పదం కాలేదు. కానీ లోఫర్ అనే టైటిల్ పై మాత్రం కచ్చితంగా విమర్శలు రావడం ఖాయం. నిజంగా ఇదే టైటిల్ కనుక ఫిక్స్ చేస్తే దర్శకుడు-హీరో మరోసారి కూర్చొని ఆలోచించుకోవడం బెటర్. ప్రస్తుతం వరుణ్ తేజ, క్రిష్ దర్శకత్వంలో కంచె అనే సినిమా చేస్తున్నాడు. ఈ నెలాఖరుకు అది కొలిక్కి వస్తుంది. వచ్చే నెల నుంచి పూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు వరుణ్. పూరి-వరుణ్ సినిమాలో దిషా అనే బాలీవుడ్ అమ్మాయి హీరోయిన్ గా నటించనుంది.
First Published:  21 Jun 2015 9:04 PM GMT
Next Story