Telugu Global
Cinema & Entertainment

బాహుబలి సెన్సార్ పూర్తి

ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. యుద్ధసన్నివేశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిన సినిమా కాబట్టి, కొన్ని హింసాత్మక సన్నివేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఒకసినిమా దాదాపు 20 రోజులకు ముందే సెన్సార్ పూర్తిచేసుకోవడం నిజంగా విశేషం. ఈమధ్య కాలంలో ఏ సినిమాకు ఇలా జరగలేదు. చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేందుకే బాహుబలి టీం ఇలా 20 రోజుల ముందే సెన్సార్ […]

బాహుబలి సెన్సార్ పూర్తి
X
ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. యుద్ధసన్నివేశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిన సినిమా కాబట్టి, కొన్ని హింసాత్మక సన్నివేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఒకసినిమా దాదాపు 20 రోజులకు ముందే సెన్సార్ పూర్తిచేసుకోవడం నిజంగా విశేషం. ఈమధ్య కాలంలో ఏ సినిమాకు ఇలా జరగలేదు. చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించేందుకే బాహుబలి టీం ఇలా 20 రోజుల ముందే సెన్సార్ పూర్తిచేసింది. ప్రచారంలో కూడా సెన్సార్ పూర్తయిన ట్రయిలర్స్ నే ఉపయోగించాలనుకుంటున్నాడు రాజమౌళి. సినిమాకు సంబంధించి దాదాపు అన్ని పనులు పూర్తయిపోవడంతో ఇప్పుడు పూర్తిగా మార్కెటింగ్ పై దృష్టిపెట్టాలనుకున్నాడు జక్కన్న. టాలీవుడ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూనే, సేమ్ టైం బాలీవుడ్ లో కూడా కాస్త కొత్తగా, మరింత ఎక్కువగా బాహుబలికి ప్రచారం కల్పించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో కరణ్ జోహార్, బాహుబలి లో విలన్ గా నటించిన రానా కలిసి వర్కవుట్ చేస్తున్నారు. బాహుబలి సినిమా ప్రమోషన్ గురువారం నుంచి అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశముంది.
First Published:  22 Jun 2015 11:46 PM GMT
Next Story