Telugu Global
Cinema & Entertainment

న‌య‌న‌తార శీను గాడి తో వ‌స్తుంది..!

డ‌బ్బింగ్ చిత్రాలు  తెలుగు స్ట్ర‌యిట్ సినిమాను మింగేస్తున్నాయా..? ఈ విష‌యం పై భిన్నాభిప్రాయాలుండోచ్చు.  డ‌బ్బింగ్ చిత్రాల తాకిడి వుండ‌టంతో ..తెలుగులో చిన్న చిత్రాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదంటారు కొంద‌రు.  డ‌బ్బింగ్ చిత్రాలు ..స్ట్ర‌యిట్ చిత్రాలు అని కాదు.. మంచి చిత్రాలు లేక పోతే ధియేట‌ర్స్ ఫీడింగ్ క‌ష్టం అంటారు ఎగ్జిబీట‌ర్స్.  ఉద‌య‌నిధి స్టాలిన్..న‌య‌న‌తార  న‌టించిన  ఒక త‌మిళ సినిమాను  తెలుగులో శీను గాడు ల‌వ్ స్టోరి పేరు తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుద‌ల […]

న‌య‌న‌తార శీను గాడి తో వ‌స్తుంది..!
X

డ‌బ్బింగ్ చిత్రాలు తెలుగు స్ట్ర‌యిట్ సినిమాను మింగేస్తున్నాయా..? ఈ విష‌యం పై భిన్నాభిప్రాయాలుండోచ్చు. డ‌బ్బింగ్ చిత్రాల తాకిడి వుండ‌టంతో ..తెలుగులో చిన్న చిత్రాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదంటారు కొంద‌రు. డ‌బ్బింగ్ చిత్రాలు ..స్ట్ర‌యిట్ చిత్రాలు అని కాదు.. మంచి చిత్రాలు లేక పోతే ధియేట‌ర్స్ ఫీడింగ్ క‌ష్టం అంటారు ఎగ్జిబీట‌ర్స్. ఉద‌య‌నిధి స్టాలిన్..న‌య‌న‌తార న‌టించిన ఒక త‌మిళ సినిమాను తెలుగులో శీను గాడు ల‌వ్ స్టోరి పేరు తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుద‌ల సంద‌ర్భంగా వ‌చ్చిన నిర్మాత‌లు కొంద‌రు డ‌బ్బింగ్ చిత్రాల గురించి.. నిర్మాత‌ల క‌ష్టాల గురించి మాట్లాడారు. హీరో ఆకాష్ డ‌బ్బింగ్ చిత్రాల్ని క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మాదిరి నిషేధించాలంటారు.

ఇక శీను గాడు ల‌వ్ స్టోరి త‌మిళ్ లో ఉద‌య‌నిధి స్టాలిన్ న‌టించిన చిత్రాల్లో మంచి వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ తేల్చారు. ఈ సినిమాను తెలుగులో డ‌బ్బింగ్ చిత్రాల్ని త‌రుచు తెలుగులో ప్రొడ్యూస్ చేసే రామ స‌త్య‌నారాయ‌ణ గారు విడుద‌ల చేస్తున్నారు. తెలుగు అభిమాన‌ల‌కు కావాల‌సిన అన్ని దినుసులు ఈ చిత్రంలో వున్నాయన్నారు. ఈ చిత్రంలో త‌మిళ కామెడియ‌న్ సంతానం క‌డుపుబ్బా న‌వ్విస్తార‌ని నిర్మాత తెలిపారు. ఈ నెల 26న శీను గాడు ల‌వ్ స్టోరి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సో హాట్ బ్యూటీ న‌య‌నతార ఇలా త‌మిళ హీరోల‌తో త‌ర‌చు తెలుగు అభిమాన‌ల‌కు ట‌చ్ లో ఉంటుందన్న‌మాట‌. న‌య‌న స్ట్ర‌యిట్ ఫిల్మ్ తెలుగులో ఎప్ప‌టికి వ‌స్తుందో…!

First Published:  23 Jun 2015 2:30 AM GMT
Next Story