Telugu Global
NEWS

నేను పార్టీ మార‌డం లేదు: జ‌య‌సుధ‌

తాను టీఆర్ ఎస్‌లో చేరుతున్న‌ట్లు వస్తున్న వార్త‌ల‌ను జ‌య‌సుధ ఖండించారు. జ‌య‌సుధ కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస‌లో చేర‌తార‌ని సోమ‌వారం ప్ర‌చారం జ‌రిగింది. కొంత‌కాలంగా పార్టీలో స‌రైన ప్రాధాన్యం దక్క‌టం లేద‌న్న  ఆమె అసంతృప్తితో ఉన్నారు.  జ‌య‌సుధ కుమారుడు హీరోగా న‌టించిన బ‌స్తీ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌ర‌వ్వ‌డంతో జ‌య‌సుధ టీఆర్ ఎస్‌లో చేరుతున్నార‌న్న ప్ర‌చారం మ‌రింత బ‌ల‌ప‌డింది. దీనిపై తెరాస నేత‌లు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చేయలేదు. ఈ ప్ర‌చారంపై […]

నేను పార్టీ మార‌డం లేదు: జ‌య‌సుధ‌
X
తాను టీఆర్ ఎస్‌లో చేరుతున్న‌ట్లు వస్తున్న వార్త‌ల‌ను జ‌య‌సుధ ఖండించారు. జ‌య‌సుధ కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస‌లో చేర‌తార‌ని సోమ‌వారం ప్ర‌చారం జ‌రిగింది. కొంత‌కాలంగా పార్టీలో స‌రైన ప్రాధాన్యం దక్క‌టం లేద‌న్న ఆమె అసంతృప్తితో ఉన్నారు. జ‌య‌సుధ కుమారుడు హీరోగా న‌టించిన బ‌స్తీ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌ర‌వ్వ‌డంతో జ‌య‌సుధ టీఆర్ ఎస్‌లో చేరుతున్నార‌న్న ప్ర‌చారం మ‌రింత బ‌ల‌ప‌డింది. దీనిపై తెరాస నేత‌లు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చేయలేదు. ఈ ప్ర‌చారంపై ఎట్ట‌కేల‌కు జ‌య‌సుధ స్పందించారు. ఈ మేర‌కు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డితో మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారాన్ని ఆమె ఖండించారు. త‌న‌పై మీడియాలో జ‌రుతున్న ప్ర‌చారమంతా అవాస్త‌వ‌మ‌ని ఉత్త‌మ్‌కు జ‌యసుధ వివ‌రించారు.
First Published:  23 Jun 2015 2:59 AM GMT
Next Story