Telugu Global
Cinema & Entertainment

కోటికి చేరిన ప్రియాంక క్రేజ్

హీరోహీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందనే అంశానికి నిన్నటివరకు కొలమానం లేదు. అంతులేని అభిమానవర్గం ఉందని అంతా చెప్పుకుంటారు. కానీ లెక్కకు మాత్రం దొరకదు. ఇప్పుడు అలాంటి ఊహాజనితాలకు తావులేదు. సోషల్ మీడియాలో క్రేజ్ ను కొలిచే కొలమానాలు వచ్చేశాయి. నిజంగా ఓ హీరోకు లేదా హీరోయిన్ కు క్రేజ్ ఉంటే ఆటోమేటిగ్గా ఫాలోవర్స్ పెరుగుతారు. లైక్స్ పెరుగుతాయి. హిట్స్ పెరుగుతాయి. ఆ సంఖ్యే ఇప్పుడు అభిమానానికి కొలమానంగా మారింది. ఇలా చూసుకుంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా అందరికంటే […]

కోటికి చేరిన ప్రియాంక క్రేజ్
X
హీరోహీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందనే అంశానికి నిన్నటివరకు కొలమానం లేదు. అంతులేని అభిమానవర్గం ఉందని అంతా చెప్పుకుంటారు. కానీ లెక్కకు మాత్రం దొరకదు. ఇప్పుడు అలాంటి ఊహాజనితాలకు తావులేదు. సోషల్ మీడియాలో క్రేజ్ ను కొలిచే కొలమానాలు వచ్చేశాయి. నిజంగా ఓ హీరోకు లేదా హీరోయిన్ కు క్రేజ్ ఉంటే ఆటోమేటిగ్గా ఫాలోవర్స్ పెరుగుతారు. లైక్స్ పెరుగుతాయి. హిట్స్ పెరుగుతాయి. ఆ సంఖ్యే ఇప్పుడు అభిమానానికి కొలమానంగా మారింది. ఇలా చూసుకుంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా అందరికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా మారిపోయింది. ఆమె ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు కోటికి చేరింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు ఇంతమంది ఫాలోవర్స్ లేరు. ఈ విషయంలో నంబర్ వన్ అనిపించుకుంది ప్రియాంకచోప్రా. ట్విట్టర్ లో 10 మిలియన్లకు చేరిన సందర్భంగా ప్రియంక అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పటికీ తనపై ఇలానే అభిమానం చూపించాలని కోరుకుంది. అందం-క్రేజ్ ఉన్నంతవరకే హీరోయిన్లకు ఫాలోయింగ్ ఉంటుందనే విషయం ప్రియాంక తెలుసుకుంటే మంచిది.
First Published:  22 Jun 2015 11:55 PM GMT
Next Story