Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌దేవి లుక్ అదుర్స్...

హీరోయిన్ కెరీర్ స్పాన్ చాల త‌క్కువ‌. అయితే ఈ విష‌యంలో  శ్రీ‌దేవి లాంటి హీరోయిన్ కు మిన‌హాయింపు అనే చెప్పాలి.  ప్ర‌స్తుతం ఆమే వ‌య‌సు ఆరు ప‌దులకు ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితేనేమి ఆమే వ‌య‌సుకంటే ఒక ప‌ది సంవ‌త్స‌రాలు త‌క్కువ క‌నిపిస్తారు. ఆఫ్ కోర్స్ గ్లామ‌ర్ న‌టిగా త‌న ప్ర‌స్థానం  చ‌రిత్ర‌లో ఒక పేజి అని చెప్పుకోవ‌డం అతిశ‌యోక్తి కాదు. ఇక అస‌లు విష‌యం ఏమిటంటే.. తాజాగా   త‌మిళ స్టార్ హీరో విజ‌య్  న‌టిస్తున్న పులి చిత్రం  […]

శ్రీ‌దేవి లుక్ అదుర్స్...
X

హీరోయిన్ కెరీర్ స్పాన్ చాల త‌క్కువ‌. అయితే ఈ విష‌యంలో శ్రీ‌దేవి లాంటి హీరోయిన్ కు మిన‌హాయింపు అనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఆమే వ‌య‌సు ఆరు ప‌దులకు ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితేనేమి ఆమే వ‌య‌సుకంటే ఒక ప‌ది సంవ‌త్స‌రాలు త‌క్కువ క‌నిపిస్తారు. ఆఫ్ కోర్స్ గ్లామ‌ర్ న‌టిగా త‌న ప్ర‌స్థానం చ‌రిత్ర‌లో ఒక పేజి అని చెప్పుకోవ‌డం అతిశ‌యోక్తి కాదు. ఇక అస‌లు విష‌యం ఏమిటంటే.. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న పులి చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌య్యింది. ఈ చిత్రంలో శ్రీ‌దేవి మ‌హారాణి లుక్ లో క‌నిపించింది. ఈ లుక్ లో శ్రీ‌దేవి ద‌ర్పం.. రాజ‌సం.. గంభీరత చూస్తుంటే సినిమాలో త‌న రోల్ కీ అని చెప్ప‌క‌నే చెప్పొచ్చు. అయితే హీరో విజ‌య్ ఒక వారియ‌ర్ గా క‌నిపిస్తున్నాడు. కానీ అత‌ని రోల్ లో ఏ మాత్రం సిరియ‌స్ నెస్ వున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో వ‌డి వేల్ తో 23 వ పుల‌కేశి వంటి సెటైరిక‌ల్ మూవీ చేసిన శింబు దేవ‌న్ అనే ద‌ర్శకుడు..హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కొంత సైటిరిక‌ల్ గా చేసిన‌ట్లు క‌నిపిస్తుండ‌టం విజ‌య్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. అయితే శ్రీ‌దేవి మాత్రం ఆరు ప‌ద‌ల వ‌య‌సులోను త‌ను చేసే రోల్ కు ఆల్ట‌ర్ నేటివ్ ఎవ‌రు లేరు అన్నంత‌గా చేస్తుండ‌టం నిజంగా ఆమే ప్ర‌తిభ‌కు తార్కాణ‌మే క‌దా.

First Published:  23 Jun 2015 4:11 AM GMT
Next Story