Telugu Global
National

జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసు నీరుగార్చేందుకు యూపీ సీఎం య‌త్నం? 

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన  జ‌ర్న‌లిస్ట్  జ‌గేంద్ర‌సింగ్ హ‌త్య కేసును నీరు కార్చేందుకు యుపి ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు  విమ‌ర్శిస్తున్నారు. యూపీ  రాష్ట్ర మంత్రి రామమూర్తి వ‌ర్మ ప్రోద్బ‌లంతోనే పోలీసులు ఈనెల 1వ తేదీన జ‌గేంద్ర‌సింగ్ ఇంటిపై దాడి చేసి కిరోసిన్ పోసి ఆయ‌న్ను  స‌జీవ ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించారని,  ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన జ‌ర్న‌లిస్టు 8వ తేదీన మ‌ర‌ణించారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. వారి ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు  మంత్రి […]

జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసు నీరుగార్చేందుకు యూపీ సీఎం య‌త్నం? 
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన జ‌ర్న‌లిస్ట్ జ‌గేంద్ర‌సింగ్ హ‌త్య కేసును నీరు కార్చేందుకు యుపి ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు విమ‌ర్శిస్తున్నారు. యూపీ రాష్ట్ర మంత్రి రామమూర్తి వ‌ర్మ ప్రోద్బ‌లంతోనే పోలీసులు ఈనెల 1వ తేదీన జ‌గేంద్ర‌సింగ్ ఇంటిపై దాడి చేసి కిరోసిన్ పోసి ఆయ‌న్ను స‌జీవ ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించారని, ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన జ‌ర్న‌లిస్టు 8వ తేదీన మ‌ర‌ణించారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. వారి ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు మంత్రి రామమూర్తి సింగ్ వ‌ర్మ‌తో పాటు మ‌రో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసును సీబీఐ విచార‌ణ‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ కుటుంబ స‌భ్యులు నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగినా, యుపీ స‌ర్కార్ విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు. దీంతో సీనియ‌ర్ న్యాయ‌వాది ఆదిష్ సి అగ‌ర్వాల్ సుప్రీంకోర్టులో ఆ కేసు విచార‌ణ‌ను సీబీఐకు అప్ప‌గించాల్సిందిగా ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీనికి స్పందించిన న్యాయ‌స్థానం జ‌ర్న‌లిస్టు హ‌త్య కేసును సీబీఐకు ఎందుకు అప్ప‌గించ‌లేదో తెల‌పాలంటూ కేంద్రానికి, యూపీ స‌ర్కారుకు నోటీసులు పంపింది. అయితే, ఈ హ‌త్య కేసును యూపీ సీఎం అఖిలేశ్ నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు ఆరోపిస్తున్నారు. త‌న మంత్రిని ఈ హ‌త్య‌ కేసు నుంచి త‌ప్పించేందుకు ముఖ్య‌మంత్రి అఖిలేశ్ జ‌ర్న‌లిస్టు కుటుంబానికి భారీ న‌ష్ట ప‌రిహారం, మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు ఇద్ద‌రు కుమారుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తామ‌ని ప్ర‌లోభ పెట్టార‌ని, అందువ‌ల్లే ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు త‌మ నిర‌వ‌ధిక నిర‌స‌నను విర‌మించార‌ని వారు ఆరోపిస్తున్నారు. జ‌ర్న‌లిస్టును హ‌త్య చేయించిన మంత్రిపై, కేసు నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ముఖ్య‌మంత్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
First Published:  23 Jun 2015 3:23 AM GMT
Next Story