Telugu Global
NEWS

ఏసీబీకి అందిన ఫోరెన్సిక్ నివేదిక‌

ఓటుకు నోటు కేసుకు సంబంధించి అవినీతి నిరోధ‌క శాఖ‌కు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ప్రాథ‌మిక నివేదిక అందిన‌ట్టు తెలిసింది. ఈ కేసులో అరెస్ట‌యిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ల సంభాష‌ణ‌ల‌కు సంబంధించి ఆడియో, వీడియో టేపులపై విచార‌ణ జ‌రిపి నిజానిజాలు నిగ్గు తేల్చ‌డానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఏసీబీ టేపులు అంద‌జేసింది. ప‌ది రోజుల క్రితం అంద‌జేసిన ఈ టేపులను నిశితంగా ప‌రిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు త‌మ నివేదిక‌ను అవినీతి నిరోధ‌క శాఖ‌కు అంద‌జేసిన‌ట్టు […]

ఏసీబీకి అందిన ఫోరెన్సిక్ నివేదిక‌
X
ఓటుకు నోటు కేసుకు సంబంధించి అవినీతి నిరోధ‌క శాఖ‌కు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ప్రాథ‌మిక నివేదిక అందిన‌ట్టు తెలిసింది. ఈ కేసులో అరెస్ట‌యిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ల సంభాష‌ణ‌ల‌కు సంబంధించి ఆడియో, వీడియో టేపులపై విచార‌ణ జ‌రిపి నిజానిజాలు నిగ్గు తేల్చ‌డానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఏసీబీ టేపులు అంద‌జేసింది. ప‌ది రోజుల క్రితం అంద‌జేసిన ఈ టేపులను నిశితంగా ప‌రిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు త‌మ నివేదిక‌ను అవినీతి నిరోధ‌క శాఖ‌కు అంద‌జేసిన‌ట్టు తెలిసింది. ఈ టేపుల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు సంబంధించిన సంభాష‌ణ‌లు కూడా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అంద‌జేసిన నివేదిక‌లో ఆయ‌నకు సంబంధించిన స‌మాచారం కూడా ఉంటుంద‌న్న అంశం ఇపుడు అంద‌రికీ ఆస‌క్తి క‌లిగించే అంశం.
First Published:  24 Jun 2015 7:03 AM GMT
Next Story