Telugu Global
Cinema & Entertainment

చెర్రీ బ్యానర్ పేరేంటంటే...

ప్రస్తుతం హీరో రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణానికి సిద్ధమౌతున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నాడు. తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు చెర్రీ. అందుకే ఓవైపు శ్రీనువైట్ల సినిమాలో నటిస్తూనే.. మరోవైపు బ్యానర్ పనులు కూడా చూసుకుంటున్నాడు. తన కొత్త ప్రొడక్షన్ కంపెనీకి ఓ పేరు పెట్టి ఆగస్ట్ లోగా దాన్ని రిజిస్టర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో పేర్లు పరిశీలించాడు. […]

చెర్రీ బ్యానర్ పేరేంటంటే...
X
ప్రస్తుతం హీరో రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణానికి సిద్ధమౌతున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నాడు. తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు చెర్రీ. అందుకే ఓవైపు శ్రీనువైట్ల సినిమాలో నటిస్తూనే.. మరోవైపు బ్యానర్ పనులు కూడా చూసుకుంటున్నాడు. తన కొత్త ప్రొడక్షన్ కంపెనీకి ఓ పేరు పెట్టి ఆగస్ట్ లోగా దాన్ని రిజిస్టర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో పేర్లు పరిశీలించాడు. తన ఫ్రెండ్స్, బంధువులు అందరి ఒపీనియన్ తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే తన పేరుమీదే రామ్ చరణ్ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ ను పెట్టాలని ఫిక్సయ్యాడు చెర్రీ. మరిన్ని పేర్లు పరిశీలించి ఆగస్ట్ లోగా బ్యానర్ రిజిస్ట్రేషన్ పూర్తిచేస్తాడు. నిజానికి బంధువులతోపాటు ఫ్యాన్స్ చాలామంది మెగా అనే పేరు వచ్చేలా బ్యానర్ పెట్టమని సూచించారు. అయితే ఇప్పటికే మెగా సూపర్ హిట్ ఫిలిమ్స్ తో పాటు.. మెగా పేరు వచ్చేలా చిన్నాచితకా బ్యానర్లు చాలా ఉండడంతో.. ఆ ఆలోచన విరమించుకున్నాడు చరణ్. ప్రస్తుతానికైతే తన పేరుమీదే బ్యానర్ స్థాపించాలని ఫిక్స్ అయ్యాడు. చెర్రీ బ్యానర్ పేరేంటనేది మరికొన్నిరోజులాగితే తెలుస్తుంది.
First Published:  24 Jun 2015 12:48 AM GMT
Next Story