Telugu Global
Cinema & Entertainment

సమంత మనసు దోచిన సినిమా అట...

ఈమధ్య కాలంలో సమంతాను ఎప్పుడు కదిపినా అదే సినిమా గురించి చెబుతోంది.. ఏ సందర్భం వచ్చినా ఆ సినిమా ప్రస్తావన తీసుకొస్తోంది. తన కెరీర్ లోనే అల్టిమేట్ మూవీ అంటూ ఊదరగొడుతోంది. చుల్ బులీ మనసుకు అంతలా నచ్చిన ఆ సినిమా ఎట్టకేలకు విడుదలకు ముస్తాబవుతోంది. అదే 10-ఎండ్రాదుకుల్ల. విక్రమ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొంది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాను ఒకేసారి తమిళ్ తో పాటు […]

సమంత మనసు దోచిన సినిమా అట...
X
ఈమధ్య కాలంలో సమంతాను ఎప్పుడు కదిపినా అదే సినిమా గురించి చెబుతోంది.. ఏ సందర్భం వచ్చినా ఆ సినిమా ప్రస్తావన తీసుకొస్తోంది. తన కెరీర్ లోనే అల్టిమేట్ మూవీ అంటూ ఊదరగొడుతోంది. చుల్ బులీ మనసుకు అంతలా నచ్చిన ఆ సినిమా ఎట్టకేలకు విడుదలకు ముస్తాబవుతోంది. అదే 10-ఎండ్రాదుకుల్ల. విక్రమ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొంది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమాను ఒకేసారి తమిళ్ తో పాటు తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో బెస్ట్ మూవీ ఇదేనంటోంది సమంత. ఇలాంటి పాత్రల కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశానని చెబుతోంది. సమంత మాటలతో సినిమాకు ఊహించని విధంగా హైప్ వచ్చింది. విక్రమ్ ఉన్నాడు కాబట్టి అంచనాలు ఇంకాస్త పెరిగాయి. పైగా స్టార్ డైరక్టర్ మురుగదాస్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఇది క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇంతమంది స్టార్లు, సూపర్ టెక్నీషియన్లు కలిసి పనిచేశారు కాబట్టే తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.
First Published:  24 Jun 2015 12:38 AM GMT
Next Story