Telugu Global
Others

ఆంధ్ర‌లో ఓటుకు నోట్లపై ఈసీకి వైఎస్ఆర్‌సీపీ ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ తెలుగుదేశం పార్టీ ఓటుకు కోట్లు అవినీతికి పాల్ప‌డింద‌ని ఎన్నిక‌ల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్థానిక సంస్థ‌ల నుంచి ఏపీ శాస‌న‌మండ‌లికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎంపీటీసీల‌ను డ‌బ్బుతో కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం ప్ర‌య‌త్నించింద‌ని వైఎస్ఆర్‌సీపీ శాస‌న‌స‌భాప‌క్షం ఉప‌నేత జ్యోతుల నెహ్రూ, పీఏసీ స‌భ్యుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వ‌ర‌రావు ఉభ‌య‌రాష్ర్టాల ముఖ్య ఎన్నిక‌ల అధికారి భ‌న్వ‌ర్‌లాల్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీల‌ను అప‌హ‌రించి వారితో శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న […]

ఆంధ్ర‌లో ఓటుకు నోట్లపై ఈసీకి వైఎస్ఆర్‌సీపీ ఫిర్యాదు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ తెలుగుదేశం పార్టీ ఓటుకు కోట్లు అవినీతికి పాల్ప‌డింద‌ని ఎన్నిక‌ల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్థానిక సంస్థ‌ల నుంచి ఏపీ శాస‌న‌మండ‌లికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎంపీటీసీల‌ను డ‌బ్బుతో కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం ప్ర‌య‌త్నించింద‌ని వైఎస్ఆర్‌సీపీ శాస‌న‌స‌భాప‌క్షం ఉప‌నేత జ్యోతుల నెహ్రూ, పీఏసీ స‌భ్యుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వ‌ర‌రావు ఉభ‌య‌రాష్ర్టాల ముఖ్య ఎన్నిక‌ల అధికారి భ‌న్వ‌ర్‌లాల్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీల‌ను అప‌హ‌రించి వారితో శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డిని త‌క్ష‌ణం అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని, టీడీపీ అద్య‌క్షుడిపైన న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. ప్ర‌కాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీకి 496 మంది, టీడీపీకి 472మంది ఎంపీటీసీలున్నారు. దీన్ని బ‌ట్టి వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని తేలిపోవ‌డంతో 35 మంది ఎంపీటీసీల‌ను ఒక్కొక్క‌రికి 2.5 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పి శ్రీ‌నివాసులు రెడ్డి ప్ర‌లోభ‌పెట్టార‌ని వారు విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.
మొద‌ట రు.50వేల చొప్పున అడ్వాన్సుగా చెల్లించి వారిని నెల్లూరు శిబిరానికి త‌ర‌లించుకువెళ్లార‌ని చెప్పారు. త‌మ ఎంపీటీసీల‌ను అక్ర‌మంగా లాడ్జిలో ఉంచార‌న్న విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా వారు చూడ‌న‌ట్లు ఉండిపోయార‌ని పేర్కొన్నారు. త‌మ‌ను ప్ర‌లోభ‌పెట్టిన విష‌యాన్ని, శిబిరంలో నిర్బంధించిన విష‌యాన్ని స్వ‌యంగా ఎంపీటీసీలు మీడియాకు చెబుతున్న దృశ్యాల‌తో ఉన్న సీడీల‌ను కూడా ఈసీకి వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు అందించారు. ఫిర్యాదుపై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, సంబంధిత వ్య‌క్తుల‌పై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశిస్తాన‌ని భ‌న్వ‌ర్‌లాల్ వారికి హామీ ఇచ్చారు.
First Published:  23 Jun 2015 11:30 PM GMT
Next Story