Telugu Global
Cinema & Entertainment

దేశాలు చుట్టేస్తున్న సిసింద్రీ

ఏ ముహూర్తాన కొత్త సినిమా ఓపెన్ చేశాడో కానీ అఖిల్ మాత్రం దేశాలు చుట్టేస్తున్నాడు. సినిమా హైదరాబాద్ లోనే ప్రారంభమైనప్పటికీ షూటింగ్ మాత్రం విదేశాల్లోనే ఎక్కువగా జరుపుకుంటోంది. ఇప్పటికే స్పెయిన్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసింది వినాయక్ టీం. అక్కడ తీసిన సన్నివేశాలతోనే తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం థాయ్ లాండ్, బ్యాంకాక్ లో అఖిల్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కూడా మరో 5 రోజుల్లో పూర్తయిపోతుందని సమాచారం. ఈ […]

దేశాలు చుట్టేస్తున్న సిసింద్రీ
X

ఏ ముహూర్తాన కొత్త సినిమా ఓపెన్ చేశాడో కానీ అఖిల్ మాత్రం దేశాలు చుట్టేస్తున్నాడు. సినిమా హైదరాబాద్ లోనే ప్రారంభమైనప్పటికీ షూటింగ్ మాత్రం విదేశాల్లోనే ఎక్కువగా జరుపుకుంటోంది. ఇప్పటికే స్పెయిన్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసింది వినాయక్ టీం. అక్కడ తీసిన సన్నివేశాలతోనే తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం థాయ్ లాండ్, బ్యాంకాక్ లో అఖిల్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కూడా మరో 5 రోజుల్లో పూర్తయిపోతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత తిరిగి స్వదేశం రావాలనుకున్న వినాయక్ టీం, అట్నుంచి అటే మరో దేశానికి జంప్ కొట్టడానికి సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం థాయ్ ల్యాండ్ లో షూటింగ్ అయిన వెంటనే సౌతాఫ్రికా వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు వినాయక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల 1 నుంచే సౌతాఫ్రికాలో షూట్ ఉంటుంది. కేవలం ఒకేఒక సాంగ్ తీసేందుకు మాత్రమే సౌతాఫ్రికా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద అఖిల్ సినిమాలో విదేశీ లొకేషన్లు అదిరిపోతాయన్నమాట.

First Published:  24 Jun 2015 9:00 PM GMT
Next Story