Telugu Global
Cinema & Entertainment

కుర్రహీరో సరసన కాజల్

ఒకప్పుడు కాజల్ కాల్షీట్లు కోసం టాలీవుడ్ స్టార్లు ఎగబడేవారు. ఓవైపు మహేష్, మరోవైపు రామ్ చరణ్, ఇంకోవైపు ఎన్టీఆర్, మధ్యలో రవితేజ.. ఇలా ఒకరేంటి.. దాదాపు నేమ్-ఫేమ్ ఉన్న ప్రతి హీరో కాజల్ వెంటపడ్డారు. కాల్షీట్లు ఇవ్వమని తెగ బ్రతిమాలాడారు. కానీ ఇప్పుడు కాజల్ సీన్స్ రివర్స్ అయింది. బడా హీరోలు ఎవరూ కాజల్ ను కన్నెత్తిచూడట్లేదు. కొందరు సమంతాకు, మరికొందరు రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిక్స్ అయ్యారు. దీనికి తోడు భారీగా పారితోషికం డిమాండ్ […]

కుర్రహీరో సరసన కాజల్
X
ఒకప్పుడు కాజల్ కాల్షీట్లు కోసం టాలీవుడ్ స్టార్లు ఎగబడేవారు. ఓవైపు మహేష్, మరోవైపు రామ్ చరణ్, ఇంకోవైపు ఎన్టీఆర్, మధ్యలో రవితేజ.. ఇలా ఒకరేంటి.. దాదాపు నేమ్-ఫేమ్ ఉన్న ప్రతి హీరో కాజల్ వెంటపడ్డారు. కాల్షీట్లు ఇవ్వమని తెగ బ్రతిమాలాడారు. కానీ ఇప్పుడు కాజల్ సీన్స్ రివర్స్ అయింది. బడా హీరోలు ఎవరూ కాజల్ ను కన్నెత్తిచూడట్లేదు. కొందరు సమంతాకు, మరికొందరు రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిక్స్ అయ్యారు. దీనికి తోడు భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో నిర్మాతలు కూడా కాజల్ ను మెల్లగా సైడ్ చేసేశారు. ఇలాంటి టైమ్ లో నేనున్నానంటూ కాజల్ ను ఆదుకోవడానికి ముందుకొచ్చాడు నాని. తన సినిమాలో కాజల్ కు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన నాని, ఇప్పుడు కాజల్ లాంటి స్టార్ ను తన సినిమా కోసం సెలక్ట్ చేసుకున్నాడు. అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నాని హీరోగా ఈమధ్యే ప్రారంభమైన కొత్త సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు హీరో నానితో పాటు నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న కాజల్ కూడా కాల్షీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఎటొచ్చి ఆమె అనుకున్న రెమ్యునరేషన్ ఆమెకు అందాలంతే.
First Published:  24 Jun 2015 8:01 PM GMT
Next Story