Telugu Global
Others

365 రోజులూ రిటైల్‌ దుకాణాలు !

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 365 రోజులు రిటైల్‌ దుకాణాలు, దుకాణాల సముదాయాలు తెరిచే ఉంటాయి. ఇందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం ఇంతకు ముందు వారంలో ఒక రోజు దుకాణాలను మూసివేయాల్సి వచ్చే దని, దీని వల్ల అటు వ్యాపారస్తులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు కలిగేవని ది రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) సిఇఒ కుమార్‌ రాజగోపాలన్‌ తెలిపారు. తాము ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి […]

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 365 రోజులు రిటైల్‌ దుకాణాలు, దుకాణాల సముదాయాలు తెరిచే ఉంటాయి. ఇందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం ఇంతకు ముందు వారంలో ఒక రోజు దుకాణాలను మూసివేయాల్సి వచ్చే దని, దీని వల్ల అటు వ్యాపారస్తులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు కలిగేవని ది రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) సిఇఒ కుమార్‌ రాజగోపాలన్‌ తెలిపారు. తాము ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పరిశ్రమల శాఖ సెక్రటరీతో పలుమార్లు సమావేశమయ్యామని, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఏడాదిలో 365 రోజులు దుకాణాలు తెరిచే ఉంచే అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహిస్తామని, ఉద్యోగుల పనివేళల విషయంలోనూ నిబంధనలను అమలు చేస్తామని కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వ్యాపారాల టర్నోవర్‌ సాధారణ రోజులతో పోల్చితే 15-16 శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా మరింత ఎక్కువ మందికి ఉపాధి లభించే ఆస్కారం ఉందన్నారు.
First Published:  25 Jun 2015 1:07 PM GMT
Next Story