విశాఖలో రూ.7.9 లక్షల నకిలీ కరెన్సీ సీజ్‌

విశాఖలోని రైల్వేస్టేషనులో గౌహతి నుంచి బెంగుళూరు వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో రూ.7.9 లక్షల నకిలీ కరెన్సీని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. బంగ్లాదేశ్ నుంచి ముందుగా అస్సాంకు వ‌చ్చి అక్క‌డ నుంచి వివిధ ప్రాంతాల‌కు న‌కిలీ క‌రెన్సీ త‌ర‌లింపు జ‌రుగుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు. ప్ర‌స్తుత 7.9 ల‌క్ష‌ల న‌కిలీ క‌రెన్సీని బెంగళూరుకు తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. అస్సాం నుంచి ఎక్క‌డెక్క‌డికి ఇలా న‌కిలీ క‌రెన్సీ త‌ర‌లిస్తున్నార‌నే విష‌యం డీఆర్ఐ అధికారులు నిందితుల నుంచి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.