Telugu Global
Others

అక్షిత గోల్డ్ ఆస్తుల జ‌ప్తు

అధిక వ‌డ్డీ ఆశ చూపి డిపాజిట‌ర్ల‌ను మోసం చేసిన అనంత‌పురం జిల్లాకు చెందిన అక్షిత గోల్డ్ అగ్రిఫాం సంస్థ ఆస్తుల‌ను పోలీసులు జ‌ప్తు చేశారు. ఈ సంస్థ‌కు చెందిన 39.94 ఎక‌రాల భూమిని స్వాధీనం చేసుకుంటున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్  హోంశాఖ గురువారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి రోజు, వారం, నెల‌వారీ డిపాజిట్ల పేర ఈ సంస్థ డ‌బ్బ వ‌సూలు చేసి సుమారు రూ.13 కోట్ల మేర ఎగ్గొట్టిన‌ట్లు పోలీసులు ద‌ర్యాప్తులో తేలింది. డిపాజిట‌ర్ల […]

అధిక వ‌డ్డీ ఆశ చూపి డిపాజిట‌ర్ల‌ను మోసం చేసిన అనంత‌పురం జిల్లాకు చెందిన అక్షిత గోల్డ్ అగ్రిఫాం సంస్థ ఆస్తుల‌ను పోలీసులు జ‌ప్తు చేశారు. ఈ సంస్థ‌కు చెందిన 39.94 ఎక‌రాల భూమిని స్వాధీనం చేసుకుంటున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంశాఖ గురువారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి రోజు, వారం, నెల‌వారీ డిపాజిట్ల పేర ఈ సంస్థ డ‌బ్బ వ‌సూలు చేసి సుమారు రూ.13 కోట్ల మేర ఎగ్గొట్టిన‌ట్లు పోలీసులు ద‌ర్యాప్తులో తేలింది. డిపాజిట‌ర్ల నుంచి వ‌సూలు చేసిన డ‌బ్బుతో వివిధ చోట్ల స్థిరాస్తులు కొనుగోలు చేసిన‌ట్లు వెల్ల‌డైంది. మ‌రికొన్ని ఆస్తులు బినామీ వ్య‌క్తుల పేర్ల మీద బ‌దిలీ చేసిన‌ట్లు పోలీసులు ప‌సి గ‌ట్టారు. ప్ర‌స్తుతానికి ఈ కంపెనీ య‌జ‌మానుల పేరు మీదున్న39.94 ఎక‌రాల భూమిని జ‌ప్తు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బి.ప్ర‌సాద‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో 35.31 ఎక‌రాలు అనంత‌పురం జిల్లాలో, 4.63 ఎక‌రాలు ప్ర‌కాశం జిల్లాలో ఉంది.
ట్రోగోపాన్ సంస్థ ఆస్తుల జ‌ప్తు
నెల్లూరు జిల్లాలో అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన మ‌రో సంస్థ‌పై కూడా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. రూ. 11 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన ట్రోగోపాన్ ఫార్మ‌ర్స్ సొసైటీకి చెందిన రూ. 2.83 కోట్ల విలువైన ఆస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే జిల్లాలో యూత్ అండ్ స్ట్రెంత్ క్రిస్టియ‌న్ సోషియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ట్ర‌స్ట్ త‌ర‌పున రూ.11 కోట్లు డిపాజిట్లు సేక‌రించి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని పోలీసులు తేల్చారు. కావ‌లిలో ఈ సంస్థ‌కు చెందిన 160 గ‌జాల ఇంటిస్థ‌లాన్ని పోలీసులు జ‌ప్తు చేశారు.

First Published:  25 Jun 2015 1:11 PM GMT
Next Story