Telugu Global
Cinema & Entertainment

23 ఏళ్ల షారూక్

షారూక్ వయసెంతనేది అందరికీ తెలుసు. కానీ సినీజనాలకు, మరీ ముఖ్యంగా అతడి అభిమానులకు మాత్రం షారూక్ వయసు 23 ఏళ్లే. అవును.. కింగ్ ఖాన్ సినిమాల్లోకి ఎంటరై సరిగ్గా నేటికి 23 ఏళ్లయింది. రిషీకపూర్-దివ్యభారతి నటించిన దీవానా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బుల్లితెర నటుడు.. తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో బాలీవుడ్ లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాడు. విలన్ పాత్రలు చేసినా అందులో తన మార్క్ చూపించాడు. ఈ 23 ఏళ్లలో ఎన్నో బ్లాక్ […]

23 ఏళ్ల షారూక్
X
షారూక్ వయసెంతనేది అందరికీ తెలుసు. కానీ సినీజనాలకు, మరీ ముఖ్యంగా అతడి అభిమానులకు మాత్రం షారూక్ వయసు 23 ఏళ్లే. అవును.. కింగ్ ఖాన్ సినిమాల్లోకి ఎంటరై సరిగ్గా నేటికి 23 ఏళ్లయింది. రిషీకపూర్-దివ్యభారతి నటించిన దీవానా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బుల్లితెర నటుడు.. తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో బాలీవుడ్ లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాడు. విలన్ పాత్రలు చేసినా అందులో తన మార్క్ చూపించాడు. ఈ 23 ఏళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు షారూక్ ఖాన్. ఎన్ని హిట్ సినిమాలు అందించినప్పటికీ.. 23 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ సమయంలో షారూక్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాను గుర్తుచేసుకోవడం ఎంతైనా అవసరం. బాలీవుడ్ సినిమాకు షోలే, డీడీఎల్ రెండు కళ్లులాంటివి. అలాంటి సూపర్ హిట్ సినిమాతో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు కింగ్ ఖాన్. లవ్, కామెడీ, యాక్షన్, హిస్టారికల్, సైన్స్ ఫిక్సన్.. ఇలా ఎన్నో జానర్స్ లో సినిమాలు చేశాడు. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి ఓ హిట్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 23 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న షారూక్, భవిష్యత్తులో మరిన్ని హిట్ సినిమాలు అందివ్వాలని ఆశిద్దాం.
First Published:  25 Jun 2015 8:32 PM GMT
Next Story