Telugu Global
Cinema & Entertainment

ఇకపై సింగర్ కాదు.. నటుడు

కొందరి కెరీర్ ఎప్పుడు ఏ సందర్భంలో మలుపు తిరుగుతుందో వాళ్లకే తెలీదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి. రచయితగా పరిశ్రమకొచ్చిన పోసాని తర్వాత దర్శకుడయ్యాడు. డైరక్టర్ గానే స్థిరపడతాడనుకున్న టైమ్ లో తనే హీరోగా మారి మెంటల్ కృష్ణ లాంటి కొన్ని సినిమాలు కూడా తీశాడు. అయితే ఎందులోనూ సక్సెస్ కాలేకపోయాడు. ఇలాంటి టైమ్ లో వచ్చిన నాయక్ సినిమా పోసాని కెరీర్ ను మార్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయస్ట్ యాక్టర్స్ లో పోసాని […]

ఇకపై సింగర్ కాదు.. నటుడు
X
కొందరి కెరీర్ ఎప్పుడు ఏ సందర్భంలో మలుపు తిరుగుతుందో వాళ్లకే తెలీదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి. రచయితగా పరిశ్రమకొచ్చిన పోసాని తర్వాత దర్శకుడయ్యాడు. డైరక్టర్ గానే స్థిరపడతాడనుకున్న టైమ్ లో తనే హీరోగా మారి మెంటల్ కృష్ణ లాంటి కొన్ని సినిమాలు కూడా తీశాడు. అయితే ఎందులోనూ సక్సెస్ కాలేకపోయాడు. ఇలాంటి టైమ్ లో వచ్చిన నాయక్ సినిమా పోసాని కెరీర్ ను మార్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయస్ట్ యాక్టర్స్ లో పోసాని కూడా చేరిపోయాడు. అలా పోసాని కెరీర్ నటుడిగా స్థిరపడిపోయింది. ఇప్పుడీ బాటలో మరో వ్యక్తి కూడా చేరాడు. ఇన్నాళ్లూ సింగర్ గా అందరికీ పరిచయమైన బాబా సెహగల్, ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరీ ముఖ్యంగా విలన్ గా మారి లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే రుద్రమదేవి సినిమాలో విలన్ గా నటించాడు సెహగల్. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో కూడా విలన్ గా కనిపించనున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతూ చేస్తున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉండే పోలీసాఫీసర్ పాత్రను బాబా సెహగల్ పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్కయినా ఇక పాటలకు స్వస్తిచెప్పి, నటనకు ఫిక్స్ అయిపోతాడు బాబా సెహగల్.
First Published:  26 Jun 2015 2:31 AM GMT
Next Story