Telugu Global
Others

రైలు రద్దయితే మీ ఫోన్‌కే ఎస్‌ఎంఎస్‌

రైళ్లు రద్దయిన సమాచారాన్ని ప్రయాణికుల ఫోన్లకు నేరుగా అందించే సంక్షిప్త సమాచార (ఎస్‌ఎంఎస్) సేవలను ఈ నెల 21నే ప్రారంభించినట్టు రైల్వే శాఖ గురువారం తెలిపింది. పైలట్‌ ప్రాజెక్టుగా రైలు ప్రారంభ స్టేషన్‌లో టికెట్లు రిజర్వ్‌ చేసుకున్న వారికి ఈ సేవలు అందిస్తామని, తర్వాతి దశలో రద్దయిన రైలుకు సంబంధించి ఎన్ని స్టేషన్లలో ఎంతమంది ప్రయాణికులు రిజర్వ్‌ చేసుకున్నారో వారందరికీ పంపుతామని పేర్కొంది. ఆన్‌లైన్‌, నేరుగా రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులు ఇచ్చే మొబైల్‌ నంబర్‌కు ఈ ఎస్‌ఎంఎస్‌లు […]

రైళ్లు రద్దయిన సమాచారాన్ని ప్రయాణికుల ఫోన్లకు నేరుగా అందించే సంక్షిప్త సమాచార (ఎస్‌ఎంఎస్) సేవలను ఈ నెల 21నే ప్రారంభించినట్టు రైల్వే శాఖ గురువారం తెలిపింది. పైలట్‌ ప్రాజెక్టుగా రైలు ప్రారంభ స్టేషన్‌లో టికెట్లు రిజర్వ్‌ చేసుకున్న వారికి ఈ సేవలు అందిస్తామని, తర్వాతి దశలో రద్దయిన రైలుకు సంబంధించి ఎన్ని స్టేషన్లలో ఎంతమంది ప్రయాణికులు రిజర్వ్‌ చేసుకున్నారో వారందరికీ పంపుతామని పేర్కొంది. ఆన్‌లైన్‌, నేరుగా రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులు ఇచ్చే మొబైల్‌ నంబర్‌కు ఈ ఎస్‌ఎంఎస్‌లు వెళ‌తాయని, తప్పనిసరి పరిస్థితుల్లో రైలును రద్దు చేసినప్పుడు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగపడతాయని వివరించింది. కేంద్ర రైల్వే సమాచార వ్యవస్థ, రైల్వే శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.

First Published:  25 Jun 2015 1:15 PM GMT
Next Story